Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Railway Exams Group D and NTPC : రైల్వే శాఖ మంత్రివర్యులు ట్విటర్ లో చేసిన అతి ముఖ్యమైన ప్రకటన

గడిచిన రైల్వే ఎన్టీపీసీ మరియు గ్రూప్ డీ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల నిర్వహణపై మనం మన సైట్ లో పొందుపరిచిన వార్త నిజం అయింది అని మీకు తెలియజేయుటకు సంతోషం వ్యక్తం చేస్తున్నాము.

Railway Exams Group D and NTPC

మన సైట్ లో పొందుపరిచిన ఆర్టికల్ లో చెప్పినట్లుగానే నిన్న రైల్వే పరీక్షల నిర్వహణపై వేసిన హై పవర్ కమిటీ తన నివేదికను భారతీయ రైల్వే బోర్డు కు అందజేసినట్లు స్వయానా భారతీయ రైల్వే శాఖ మంత్రివర్యులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా నేడు అనగా మార్చి 5వ తేదీన ఉదయం 10:32 గంటలకు ట్వీట్ చేశారు.Railway Exams Group D and NTPC

పరీక్షలపై నెలకొని ఉన్న సందేహలపై సుమారుగా మూడు లక్షలకు పైగా రీప్రెసెంటేషన్స్ అభ్యర్థుల నుండి వచ్చాయని, కమిటీ ఈ మూడు లక్షల అభ్యర్థులు వ్యక్తం చేసిన సందేహాలకు పరిష్కరాం దిశగా సమాలోచనలు జరిపి ఒక నివేదికను భారతీయ రైల్వే బోర్డు కు హై పవర్ కమిటీ అందజేసినట్లుగా రైల్వే మంత్రివర్యులు చేసిన ప్రకటన ద్వారా మనకు తెలుస్తుంది.

రాబోయే అతి కొద్దీ రోజుల్లో ఈ రైల్వే పరీక్షల నిర్వహణపై రైల్వే బోర్డు తమ నిర్ణయాలు తెలుపుతుందని రైల్వే శాఖ మంత్రివర్యులు ట్విట్టర్ ద్వారా ఈ తాజా  ప్రకటనలో తెలిపారు.

కాబట్టి అభ్యర్థులు ఎవరూ మీ రైల్వే ప్రేపరషన్ ను ఆపకుండా, మీ పరీక్షల ప్రీపరేషన్ ను కొనసాగించాలని మన సైట్ తరుపున కోరుతున్నాము.


Post a Comment

0 Comments