భారతీయ రైల్వేలో ఇప్పటి వరకూ భారీ సంఖ్యలో ఖాళీల భర్తీను చేపట్టినట్లు కేంద్ర రైల్వే రైల్వే శాఖ మంత్రివర్యులు లోక్ సభ వేదికగా అధికారికంగా ఒక ప్రకటన చేశారు.
ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా రైల్వే డిపార్టుమెంటు లలో ఖాళీగా ఉన్న 2,94,687 పోస్టులలో 1,53,974 పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసినట్లుగా మంత్రివర్యులు తెలిపారు.
ఈ ఖాళీ పోస్టులలో మిగిలిన 1,40,713 పోస్టుల భర్తీ ప్రక్రియను ఆరంభించామని, ప్రస్తుతం ఈ పోస్టుల భర్తీకు పరీక్షలను నిర్వహిస్తున్నామని ఈ ప్రకటనలో వివరించారు.
మంత్రివర్యులు ప్రకటించిన ప్రకటన ప్రకారం తెలుగు రాష్ట్రాలలో రైల్వే పోస్టుల సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది.
దక్షిణ మధ్య రైల్వే - 16,736
సికింద్రాబాద్ ఆర్ఆర్ బీ పరిధి - 10,038
భవిష్యత్తు లో భారతీయ రైల్వేలను ప్రైవేటికరించే ఉద్దేశ్యం భారతీయ కేంద్ర ప్రభుత్వంనకు లేదని రైల్వే శాఖ మంత్రివర్యులు లోక్ సభ వేదికగా చేసిన ప్రకటన ద్వారా స్పష్టం చేశారు.
మరిన్ని రైల్వే ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి Click Here
0 Comments