గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్ కు చెందిన డిఫెన్స్ జియో ఇన్ఫర్మేటిక్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ లో ఖాళీగా ఉన్నా పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1).ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.
3). ఆకర్షణీయమైన వేతనాలు.
ఈ పోస్టులకి అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
డీఆర్డీఓ నుండి వచ్చిన ఈ ప్రకటనలో తెలిపిన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : ప్రకటన వచ్చిన 21 రోజుల లోపు.
విభాగాల వారీగా ఖాళీలు :
రీసెర్చ్ అసోసియేట్ - 1
జూనియర్ రీసెర్చ్ ఫెలో - 4
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి సంబంధిత సబ్జెక్టు విభాగాలలో అనగా పీ.హెచ్డీ ఇన్ జియోలజీ /జియో - ఇన్ఫర్మేటిక్స్/రిమోట్ సెన్సింగ్ లేదా ఎంఈ/ఎంటెక్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రిమోట్ సెన్సింగ్ /జియో - ఇన్ఫర్మేటిక్స్ విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైన్స్ డిగ్రీ, నెట్/గేట్ స్కోర్లతో లేదా ఎంఈ/ఎంటెక్ కోర్సులను పూర్తి చేసిన వారు, కంప్యూటర్ సైన్స్ /కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగాలలో బీఈ/బీటెక్ /ఎంఈ/ఎంటెక్ /నెట్ /గేట్ మొదలైన కోర్సులు, పరీక్షలలో అర్హతలు కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ప్రకటనలో తెలిపారు.
వయసు :
28-35 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
అభ్యర్థులు మొదటగా అప్లికేషన్ ఫారం ను నింపి తదుపరి దరఖాస్తు ఫారంనకు సంబంధిత విద్యా దృవీకరణ పత్రాలను జతపరచి ఈ క్రింది అడ్రస్ కు అభ్యర్థులు రిజిస్టర్ /స్పీడ్ పోస్ట్ ద్వారా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
ఎలా ఎంపిక చేస్తారు..?
షార్ట్ లిస్ట్ మరియు వాక్ ఇన్ ఇంటర్వ్యూల విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షనీయమైన జీతములు లభించనున్నాయి.
దరఖాస్తులు పంపవలసిన అడ్రస్ :
The Director,
Defence Geoinformatics Research Establishment (DGRE), Him parisar, Plot No. 01, Sector - 37A,
Chandigarh(UT)-160036.

0 Comments