భారత దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ కార్యాలయాలలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన గ్రూప్ - సీ నాన్ - గేజిటెడ్, నాన్ - మినిస్ట్రీయల్ పోస్టులు.
2). డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో పోస్టుల భర్తీ.
3). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.
4). భారీ సంఖ్యలో పోస్టుల భర్తీ.
5). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన వారు విశాఖపట్నం మరియు హైదరాబాద్ నగరాలలో కూడా ఉద్యోగాలు చేసుకోవచ్చు.
ఎస్ఎస్సీ నుండి వచ్చిన ఈ తాజా ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : మార్చి 22, 2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : ఏప్రిల్ 30, 2022
ఆన్లైన్ లో ఫీజుల చెల్లింపుకు చివరి తేది : మే 2 , 2022
చలానా ఫీజులు చెల్లింపులకు చివరితేది : మే 5, 2022
ఆన్లైన్ సీబీటీ పేపర్ - 1 పరీక్ష నిర్వహణ తేది : జూలై, 2022
పేపర్ - II ( డిస్క్రిప్టివ్) పరీక్ష నిర్వహణ తేది : ఇంకా ప్రకటించలేదు.
విభాగాల వారీగా ఖాళీలు :
మల్టి టాస్కింగ్ సిబ్బంది - 3603
తెలుగు రాష్ట్రాలలో హవాల్దార్ ఖాళీలు :
హైదరాబాద్ - 152
విశాఖపట్నం - 38
మొత్తం ఉద్యోగాలు :
ఈ ప్రకటన ద్వారా మొత్తం 3600కు పైగా సెంట్రల్ గవర్నమెంట్ పోస్టుల భర్తీని చేయనున్నారు.
ఇరు తెలుగు రాష్ట్రాలలో అయితే 190 హవాల్దార్ పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు /స్కూల్ నుండి 10వ తరగతి /మెట్రిక్యూలేషన్ ను పూర్తి చేయవలెను. నిర్థిష్ట శారీరక ప్రమాణాలు అవసరం అని ప్రకటనలో తెలిపారు.
వయసు :
18 నుండి 27 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు మరియు దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 100 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
మహిళలు, మాజీ సైనికులు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్(CBE), ఫీజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (PET), ఫీజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), మెడికల్ ఎక్సమినేషన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
సిలబస్ - వివరాలు :
పేపర్ - 1 పరీక్షలలో జనరల్ ఇంగ్లీష్ , జనరల్ ఇంటలిజెన్స్ & రీసనింగ్ మరియు న్యూమరికల్ అప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ తదితర అంశాలపై ప్రశ్నలను అడుగనున్నారు.
మొత్తం 100 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి 90 నిమిషాలుగా ఉంది.
పేపర్ - 2 లో భాగంగా షార్ట్ ఎస్సయ్ అండ్ లెటర్ ఇన్ ఇంగ్లీష్ లేదా ఏదైనా భాషలో అభ్యర్థులు వ్రాయవలసి ఉంటుంది. ఈ పరీక్షకు 50 మార్కులు కేటాయించగా, కాలవ్యవధి 45 నిముషాలుగా ఉంది.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 7th పే కమిషన్ ను అనుసరించి ఆకర్షనీయమైన జీతం లభించనుంది.
తెలుగు రాష్ట్రాలల్లో కేటాయించబడిన పరీక్ష కేంద్రాలు :
ఆంధ్రప్రదేశ్ :
చీరాల , గుంటూరు,కాకినాడ, కర్నూల్,నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం.
తెలంగాణ :
కరీంనగర్, వరంగల్ మరియు హైదరాబాద్.
0 Comments