గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్ (DRDO) ఆధ్వర్యంలో ఉన్న సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్ వర్తినెస్ అండ్ సర్టిఫికెషన్ (CEMILAC) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న అప్ప్రెంటీస్ షిప్ ట్రైనీ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన అప్ప్రెంటిస్ ట్రైనీ లు.
2). ఈ అప్ప్రెంటిస్ ట్రైనింగ్ భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియమాకాలలో ఉపయోగకరంగా ఉంటుంది.
3). గౌరవ స్థాయిలో స్టైఫండ్స్.
ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు. DRDO Vacancies
డీఆర్డీఓ నుండి వచ్చిన ఈ తాజా ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : ఏప్రిల్ 1, 2022
సెలెక్టెడ్ కాండిడేట్స్ లిస్ట్ విడుదల తేది : ఏప్రిల్ 25, 2022
జాయినింగ్ తేది : ఏప్రిల్ 29, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
గ్రాడ్యుయేట్ అప్ప్రెంటీస్ షిప్ ట్రైనీస్(బీఈ/బీటెక్) - 10
టెక్నీషియన్ (డిప్లొమా) అప్ప్రెంటీస్ షిప్ ట్రైనీస్ - 10
మొత్తం పోస్టులు :
20 అప్ప్రెంటీస్ షిప్ పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల నుండి మెకానికల్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ /కంప్యూటర్ సైన్స్ /ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విభాగాలలో బీఈ/బీటెక్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ గ్రాడ్యుయేట్ అప్ప్రెంటిస్ షిప్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
కెమికల్ /ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/కంప్యూటర్ సైన్స్ విభాగాలలో డిప్లొమా కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు టెక్నీషియన్ (డిప్లొమా) అప్ప్రెంటీస్ షిప్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ప్రకటన ద్వారా తెలిపారు.
వయసు :
కేటగిరీలను అనుసరించి 18-37 సంవత్సరాలు వరకూ వయసు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను ఆ తదుపరి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు..?
షార్ట్ లిస్ట్ మరియు విద్యా అర్హతల క్వాలిఫై ఎగ్జామ్స్ మార్కులను అనుసరించి ఈ అప్ప్రెంటీస్ షిప్ ట్రైనీ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
స్టై ఫండ్ :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 8,000-9,000 రూపాయలు వరకూ స్టై ఫండ్స్ లభించనున్నాయి.

0 Comments