ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది టీచర్ ట్రైనీస్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ ఒక శుభవార్తను అందించినట్లుగా తెలుస్తుంది.
గడిచిన మూడు సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 4 నుండి 6 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే టెట్ మరియు డీఎస్సీ నిర్వహణల గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే రాబోయే రెండు నెలల్లో అనగా జూన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా నిర్వహించే ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(AP TET - 2022 ) ను నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ సన్నాహాలను చేస్తున్నట్లుగా తెలుస్తుంది.
ఏపీ లో 2018 తరువాత టెట్ పరీక్షను నిర్వహించలేదు. ఈ సందర్భంలోనే లక్షలాది మంది టీచర్ ట్రైనీస్ అభ్యర్థులు ఉపాధ్యాయ అర్హత పరీక్ష గురించి వేయి కళ్ళతో నిరీక్షిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పోలీస్ అకాడమీ లో ఉద్యోగాలు, జీతం 63,200 రూపాయలు వరకూ Click Here
జూన్ నెలలో టెట్ 2022 పరీక్ష నిర్వహణ అనంతరం, ఏపీ లో ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ బదిలీలు మరియు ప్రమోషన్స్ ప్రక్రియ పూర్తి అయినా వెంటనే ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల ఖాళీలను లెక్కగట్టి, టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహణను నిర్వహించే ఆలోచనలో ఏపీ విద్యాశాఖ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటివరకు 6000 ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఇటీవలే జరిగిన శాసనసభ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రివర్యులు తెలిపినట్లుగా తెలుస్తుంది.
కాబట్టి, ఏపీ లో తాజాగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు ఇప్పటి నుండే టెట్ మరియు డీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ కావడం మంచిది అని మనం చెప్పుకోవచ్చు.
SSC MTS 3500 Jobs Click Here
పరీక్ష లేదు, DRDO లో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు Click Here

0 Comments