Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

EXIM Bank Jobs 2022 : ఎగ్జిమ్ బ్యాంక్ లో మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టులు,స్టైఫండ్స్ 55,000 రూపాయలు

ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ లో ఖాళీగా ఉన్న మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది. ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ లో మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టులు, స్టైఫండ్స్ 55,000 రూపాయలు, వెంటనే అప్లై చేసుకోండి.

ముఖ్యంశాలు  :

1). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.

2). భారీ స్థాయిలో స్టై ఫండ్స్.

3). రెగ్యులర్ గా చేసుకునే అవకాశం గలదు.

ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

EXIM Bank Jobs 2022

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు.

ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ నుండి వచ్చిన ఈ నోటిఫికేషన్ లో పొందుపరిచిన ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.EXIM Bank Jobs 2022

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది    :     మార్చి 14, 2022.

వ్రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు : ఏప్రిల్, 2022.

పోస్టులు - వివరాలు :

మేనేజ్మెంట్ ట్రైనీ        -      25

విభాగాల వారీగా ఖాళీలు  :

యూఆర్      -      13

ఎస్సీ            -       4

ఎస్టీ               -      2

ఓబీసీ           -      6

Ews               -      2

Pwd               -      1

మొత్తం పోస్టులు :

25 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల నుండి ఫుల్ టైమ్ విధానములో 60% మార్కులతో ఎంబీఏ/పీజీడీబీఏ విత్ స్పెషలైజెషన్ ఇన్ ఫైనాన్స్ /చార్టర్డ్ అకౌంటెంట్స్(సీఏ) మొదలైన కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్స్ ప్రోఫీషియన్సీ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫీషియన్సీ కలిగి ఉండాలని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

వయసు :

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే యూఆర్/ews అభ్యర్థులకు 25 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 30 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 28 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

జనరల్ /ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 600 రూపాయలు మరియు ఎస్సీ/ఎస్టీ/దివ్యంగులు/ews మరియు  మహిళా కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 100 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను అని ప్రకటనలో తెలిపారు.

ఎలా ఎంపిక చేస్తారు..?

వ్రాత పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూ విధానాలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

పరీక్ష విధానం - సిలబస్ :

1).105 ప్రశ్నలకు 200 మార్కులను కేటాయించడం జరిగింది.

2).పరీక్ష కాలవ్యవధి 150 నిముషాలుగా ఉంది.

3). రీసనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, ఫైనాన్సియల్ అవేర్నెస్, డెస్క్రిప్టివ్ పేపర్ ఆన్ ఇంగ్లీష్, డెస్క్రిప్టివ్ పేపర్ ఆన్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ తదితర అంశాలను పరీక్షలో అడుగనున్నారు.

జీతం  :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు  ట్రైనీ షిప్ లో నెలకు 55,000 రూపాయలు వరకూ స్టై ఫండ్స్ లభించనున్నాయి.

ట్రైనీ షిప్ తదుపరి డిప్యూటీ మేనేజర్ అయిన వారికి సంవత్సరానికి 17 లక్షల రూపాయలు వరకూ జీతం అందనుంది.

పరీక్ష కేంద్రం - ఎంపిక  :

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు హైదరాబాద్ నగరాన్ని పరీక్ష కేంద్రంగా ఎంపిక చేసుకోవచ్చు.

Notification and Apply Link

Post a Comment

0 Comments