స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.
2). భారీ స్థాయిలు జీతం.
3). కాంట్రాక్టు బేసిస్ లో భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
శాప్ నుండి వచ్చిన ఈ తాజా నోటిఫికేషన్ లో పొందుపరిచిన ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : మార్చి 10, 2022.
విభాగాల వారీగా ఖాళీలు :
సీనియర్ కన్సల్టెంట్స్ - 2
మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ - 2
మీడియా మేనేజర్ - 1
మొత్తం పోస్టులు :
5 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల నుండి సంబంధిత సబ్జెక్టుల విభాగాలలో గ్రాడ్యుయేషన్ కోర్స్ లు, ఐఐటీ/ఐఐఎం/ఐఎస్బీ/బిట్స్ పీలాని నుండి మాస్టర్ డిగ్రీ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కోర్సులను పూర్తి చేయవలెను.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.వయసు :
కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థుల వయసు 45 మరియు 50 సంవత్సరాలకు మించరాదు అని ఈ ప్రకటనలో తెలిపారు.Vijayawada Saap government jobs 2022
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) ఉండే అవకాశం గలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు..?
మెరిట్ మరియు ఇంటర్వ్యూ విధానాలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 45,000 రూపాయలు నుండి 1.5 లక్షల రూపాయలు వరకూ జీతం అందనుంది.
0 Comments