ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4,764 సెకండరీ టీచర్ పోస్టులను రద్దు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయంను తాజాగా ప్రకటించినట్లుగా తెలుస్తుంది.
ఏపీ లో ఉన్న ఆదర్శ పాఠశాలలో వృత్తి బాధ్యతలను నిర్వహిస్తున్న 3,260 పోస్టులకు సర్వీసు నిబంధనల కొరకు ఈ 4,764 టీచర్ పోస్టులను విలీనం చేస్తున్నట్లుగా ఈ ఉత్తర్వులలో పొందుపరిచారు.
2013 వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం తో ఆదర్శ స్కూల్స్ ను ఆరంభించగా, 163 ప్రిన్సిపాల్స్, 1956 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టులు మరియు 1141 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపగా, వీటిలో వృత్తి బాధ్యతలు నిర్వహిస్తున్న టీచర్స్ కు ఇప్పటివరకూ సర్వీసు నిబంధనలు, పీఎఫ్ మరియు హెల్త్ కార్డుల సదుపాయాలు లభించడంలేదు. Govt Jobs Update
ఈ నేపథ్యంలోనే ఏపీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ విధానంలో సర్వీస్ నిబంధనల కోసం ఏపీ విద్యా శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఫైల్ ను పంపగా, ఆదర్శ పాఠశాలలోని 3,260 పోస్టులకు సర్వీస్ నిబంధనలను కల్పించేందుకు నాలుగు వేలకు పైగా ఎస్జీటీ టీచర్ పోస్టులను ఏపీ గవర్నమెంట్ రద్దు చేసినట్లుగా తెలుస్తుంది.
ఒక్క కర్నూల్ జిల్లా మినహా మిగిలిన ఏపీ జిల్లాల్లో జిల్లాకు 397 పోస్టుల చొప్పున సుమారుగా నాలుగు వేలకు పైగా సెకండరీ గ్రేడ్ టీచర్స్ పోస్టులను రద్దు చేసినట్లుగా తెలుస్తుంది.
మరిన్ని ఉద్యోగాల కొరకు పైన కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చెయ్యండి. Click Here

0 Comments