తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది టీచర్ ట్రైనీస్ కు ఒక మంచి శుభవార్త వచ్చినది.
ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ కు ముందుగా నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష ( టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ ) టెట్ - 2022 పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ను తాజాగా తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ విడుదల చేసింది.
ఈసారి టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు టెట్ సర్టిఫికెట్ కు జీవితకాల (లైఫ్ టైమ్ ) వాలిడిటీ లభించనున్నట్లుగా నోటిఫికేషన్ లో పొందుపరిచారు.
ఈ పరీక్షలను రెండు పేపర్లలో నిర్వహించనున్నారు.జూన్ తేదీలో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లుగా తెలంగాణ విద్యా శాఖ ఈ ప్రకటనలో పేర్కొంది. TET Update
ప్రకటనలో పొందుపరిచిన ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
నోటిఫికేషన్ విడుదల తేది : మార్చి 25, 2022
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : మార్చి 26, 2022
ఆన్లైన్ ఫీజు పేమెంట్ కు చివరి తేది : ఏప్రిల్ 11, 2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : ఏప్రిల్ 12, 2022
హాల్ టికెట్స్ డౌన్లోడ్ తేది : జూన్ 6, 2022
పరీక్ష నిర్వహణ తేది : జూన్ 12, 2022
పరీక్ష నిర్వహణ సమయం (పేపర్ 1) : 9:30AM-12PM
పరీక్ష నిర్వహణ సమయం ( పేపర్ 2) : 2:30PM-5PM
పరీక్ష ఫలితాల విడుదల తేది : జూన్ 27, 2022
ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

0 Comments