Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Police Academy Jobs 2022 : పోలీస్ అకాడమీ లో ఉద్యోగాలు, జీతం 63,200 రూపాయలు వరకూ

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో ఉన్న నార్త్ ఈస్ట్రన్ పోలీస్ అకాడమీ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయింది.

ముఖ్యాంశాలు :

1).ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.

2). డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ లో భర్తీ చేయనున్నారు.

3). భారీ స్థాయిలో వేతనాలు.

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటనలో పొందుపరిచారు.

Police Academy Jobs 2022

పోలీస్ అకాడమీ నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన ముఖ్యమైన అంశాలను గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. Police Academy Jobs 2022

ముఖ్యమైన తేదీలు  :

ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ నిర్వహణ తేది  : ఏప్రిల్ 25 & 28, 2022.

విభాగాల వారీగా ఖాళీలు   :

ఎంటీఎస్ ( కుక్ )                   -    2

ఎంటీఎస్ (మసాల్చి)              -    1

ఎంటీఎస్ (వాటర్ కారియర్ )  -    2

ఎంటీఎస్ (కాంటీన్ అటెండెంట్) -  1

పంప్ ఆపరేటర్                         -  1

ప్లంబర్                                      -  1

ఎలక్ట్రీషియన్                             -  1

లైఫ్ గార్డ్                                      - 2

ఎంటీఎస్ (స్వీపర్)                       -  1

ఎంటీఎస్(సైసీ )                            -  1

కానిస్టేబుల్ (ఎంటీ)                        -  4

కానిస్టేబుల్ (మోటార్ మేక్ )           -   1

కానిస్టేబుల్ ( బ్యాండ్ )                   -   2

కానిస్టేబుల్ ( జీడీ )                         -   8

మొత్తం పోస్టులు  :

28 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు  :

గుర్తింపు పొందిన బోర్డు ల నుండి మేట్రీక్యూలేషన్ ను పూర్తి చేసి, సంబంధిత విభాగాలలో ట్రేడ్ సర్టిఫికెట్ మరియు డిప్లొమా కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

వయసు  :

కేటగిరీ లను అనుసరించి 18-27 సంవత్సరాలు వయసు గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఆయా కేటగిరీ అభ్యర్థులకు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ వెబ్సైటు లో దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకుని, పూర్తి చేసి,అప్లికేషన్ ఫారంనకు సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలను జతపరచి, ఈ పోస్టుల భర్తీకి నిర్వహించే ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ లకు హాజరు కాబోయే అభ్యర్థులు తమ వెంట తీసుకుని వెళ్ళవలెను అని ఈ ప్రకటనలో తెలిపారు.

దరఖాస్తు ఫీజు   :

ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.

ఎలా ఎంపిక చేస్తారు..?

ఫిజికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ (PET), ట్రేడ్ టెస్ట్, మరియు వ్రాత పరీక్షల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

పరీక్ష సిలబస్ - వివరాలు  :

మొత్తం పరీక్షను 100 మార్కులకు నిర్వహించనున్నారు. సమయం 2 గంటలు ఇవ్వనున్నారు.

జనరల్ అవేర్నెస్ / జనరల్ నాలెడ్జ్     -     25

నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మాథ్స్         -     25

జనరల్ రీసనింగ్                                   -     25

జనరల్ ఇంగ్లీష్                                      -     25

జీతం   :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 18,000 - 63, 200 రూపాయలు వరకూ జీతం అందనుంది.

Website


Post a Comment

0 Comments