గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్ట్ టైల్స్ ఆధ్వర్యంలో ఉన్న ఏపీ చేనేత, జోళి శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల అయినది.
ముఖ్యాంశాలు:
1). ఇవి ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.
2). కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేయనున్నారు
3). ఆకర్షనీయమైన వేతనాలు.
4). జాతీయ చేనేత అభివృద్ధి పథకం క్రింద ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏపీ రాష్ట్రంలో శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కర్నూల్, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో ఉన్న క్లస్టర్లలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు. Handlooms Jobs Recruitment 2022
ఏపీ చేనేత శాఖ నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన అంశాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : ప్రకటన వచ్చిన 21 రోజుల లోపు..
విభాగాల వారీగా ఖాళీలు :
టెక్స్ట్ టైల్ డిజైనర్ - 12
క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ - 12
మొత్తం పోస్టులు :
24 పోస్టులను తాజాగా వచ్చిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
టెక్స్ట్ టైల్ డిజైనర్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు టెక్స్ట్ టైల్ డిజైనింగ్ కోర్సులను పూర్తి చేసి చేనేత విభాగంలో రెండు సంవత్సరాల అనుభవం ఉండవలెను.
మరియు హ్యాండ్ లూమ్ టెక్నాలజీలో డిప్లొమాతో పాటుగా రెండేళ్ల అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు.
వయసు :
ఎటువంటి వయసు పరిమితిని ఈ ప్రకటనలో పొందుపరచలేదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆఫ్ లైన్ విధానంలో అభ్యర్థులు ఈ క్రింది అడ్రస్ కు నిర్ణిత గడువు చివరి తేది లోగా పోస్ట్ ద్వారా పంపవచ్చు లేదా స్వయంగా అందించవచ్చు అని ప్రకటనలో తెలిపారు.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
ఎలా ఎంపిక చేస్తారు..?
హ్యాండ్ లూమ్ డిపార్టుమెంటు నిబంధనలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షనీయమైన వేతనాలు లభించనున్నాయి.
దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ :
సంచాలకులు,
చేనేత జోళి శాఖ,
డోర్ నెంబర్ : 11-694,
ఆప్కో సముదాయం, పాత జీటీ రోడ్,
ఎర్రబాలెం,
మంగళగిరి, గుంటూరు జిల్లా,
పిన్ కోడ్ : 522503.
0 Comments