మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఆధ్వర్యంలో ఉన్న ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ రైల్వే సంస్థకు చెందిన పోస్టులు.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.
3). కాంట్రాక్టు బేసిస్ లో పోస్టుల భర్తీ.
4). భారీ స్థాయిలో ఫిక్స్డ్ వేతనాలు ఇవ్వబడుతాయి.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చుRailway Jobs Recruitment 2022
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు చత్తిస్ ఘర్,మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తర ఖండ్, జమ్మూ & కాశ్మీర్, అస్సాం, వెస్ట్ బెంగాల్, సిక్కింలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ఇర్కాన్ నుండి వచ్చిన ఈ నోటిఫికేషన్ లో పొందుపరచబడిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో రిజిస్ట్రేషన్స్ కు చివరి తేదిలు : మార్చి 28 & 30, 2022.
విభాగాల వారీగా ఖాళీలు :
మేనేజర్ /బ్రిడ్జ్ ఆన్ కాంట్రాక్ట్ - 4
మేనేజర్ /ఎర్త్ వర్క్ ఆన్ కాంట్రాక్ట్ - 4
మేనేజర్ /సివిల్ ఆన్ కాంట్రాక్ట్ - 8
మేనేజర్ /జనరల్ ఆన్ కాంట్రాక్ట్ - 1
మేనేజర్ /లీగల్ ఆన్ కాంట్రాక్ట్ - 1
మేనేజర్ /ఎస్&టీ ఆన్ కాంట్రాక్ట్ - 6
సీనియర్ వర్క్ ఇంజనీర్ /సర్వే - 2
సేఫ్టీ ఇంజనీర్ - 2
సీనియర్ వర్క్ ఇంజనీర్ /క్వాలిటీ - 1
మొత్తం పోస్టులు :
29 పోస్టులను తాజాగా వచ్చిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ /బోర్డుల నుండి 60% మార్కులతో సివిల్ ఇంజనీరింగ్ /ఎల్ ఎల్ బీ /ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ &కమ్యూనికేషన్ /ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్ /హెల్త్ &సేఫ్టీ విభాగాలలో ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ డిగ్రీ / ఫుల్ టైమ్ డిప్లొమా కోర్సులను పూర్తి చేసి, సంబంధిత విభాగాలలో అనుభవం ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
కేటగిరీ లను అనుసరించి 35, 50 సంవత్సరాలు వయసు లోపు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం ఆయా కేటగిరీ లకు చెందిన అభ్యర్థులకు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆఫ్ లైన్ విధానంలో సంబంధిత రాష్ట్రాలలో ఉన్న ఇర్కాన్ గ్రూప్ జోనల్ కార్యాలయంలలో అభ్యర్థులు సంబంధిత తేదీలలో రిజిస్ట్రేషన్స్ (దరఖాస్తు) చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు..?
వర్చ్యువల్ మోడ్ లో ఇంటర్వ్యూ విధానం ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 40,000 రూపాయలు నుండి 60,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
సంప్రదించవల్సిన ఈ మెయిల్ అడ్రస్ :
recruitment@ircon.org
0 Comments