హై కోర్ట్ ఆఫ్ ఢిల్లీ లో ఖాళీగా ఉన్న 123 పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటనను తాజాగా ఢిల్లీ జ్యూడిషియల్ సర్వీస్ విడుదల చేసినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి హైకోర్టు కు సంబంధించిన ప్రభుత్వ పోస్టులు.
2). ఇరు తెలుగు రాష్ట్రముల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
3). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులే అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఢిల్లీ హై కోర్ట్ నుండి వచ్చిన ఈ తాజా ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన అంశాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. High Court Jobs 2022
ముఖ్యమైన తేదిలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : మార్చి 20, 2022 (10 PM)
ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ తేది : మార్చి 27, 2022
ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ సమయం : 11 AM to 1:30 PM
ఉద్యోగాలు - ఖాళీలు :
ఢిల్లీ జ్యూడిషియల్ సర్వీసెస్ - 123
మొత్తం పోస్టులు :
123 ఖాళీలను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
అడ్వకేట్ యాక్ట్ 1961 క్రింద ఇండియా లో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
32 సంవత్సరాలు వయసు లోపు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ/ఎస్టీ /ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ )కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ కేటగిరీ అభ్యర్థులు 1000 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 200 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు..?
ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు వైవా ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకి నెలకు జీతంగా 56,100 రూపాయలు నుండి 1,77,500 రూపాయలు వరకూ జీతం అందనుంది.
0 Comments