గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న ఐసీఏఆర్-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IARI) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లుగా ఒక ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1).ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.
2).ఎటువంటి పరీక్షల నిర్వహణ లేదు.
3). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టుల భర్తీకి నిర్వహించే ఇంటర్వ్యూలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ హాజరు కావచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటన ద్వారా తెలుస్తుంది.
ఐఏఆర్ఐ నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. IARI Jobs Recruitment 2022 Telugu
ముఖ్యమైన తేదీలు :
వాక్ -ఇన్ - ఇంటర్వ్యూ నిర్వహణ తేది : ఏప్రిల్ 12, 2022.
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : ఉదయం 9:30 గంటలకు
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
డివిజన్ ఆఫ్ ప్లాంట్ పాతోలజీ, ఐసీఏఆర్ - ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, న్యూ ఢిల్లీ - 110012.
విభాగాల వారీగా ఖాళీలు :
రీసెర్చ్ అసోసియేట్ III - 1
సీనియర్ రీసెర్చ్ ఫెలో - 2
ల్యాబ్ అటెండెంట్ - 1
ప్రాజెక్ట్ అసిస్టెంట్ - 1
మొత్తం పోస్టులు :
5 పోస్టులను తాజాగా తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి సంబంధిత సబ్జెక్టు విభాగాలలో అనగా బయో లాజికల్ సైన్స్ విభాగాలలో గ్రాడ్యుయేషన్ కోర్స్ లను, మాస్టర్ డిగ్రీ ఇన్ ప్లాంట్ పాతోలిజీ /మైక్రో బయోలజీ/బయో టెక్నాలజీ /బయో - ఇన్ఫర్మేటిక్స్ విభాగాలలో బ్యాచ్ లర్ డిగ్రీ /పోస్ట్ - గ్రాడ్యుయేట్ డిగ్రీ /మాస్టర్ డిగ్రీ, నెట్ క్వాలిఫీకేషన్ లను, పాతోలజీ /బయో టెక్నాలజీ /మైక్రో బయోలజీ విభాగాలలో పీహెచ్డీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ విభాగాల వారీగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
ఎటువంటి వయసు పరిమితి నిబంధనలను ఈ ప్రకటనలో పొందుపరచలేదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఈ ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే అభ్యర్థులు పూర్తి చేసిన అప్లికేషన్ ఫారంనకు సంబంధిత విద్యా దృవీకరణ పత్రాలను జతపరచిన అటెస్టెడ్ కాపీ డాక్యుమెంట్స్ ను మరియు ఒరిజినల్ డాకుమెంట్స్ ను తమ వెంట తీసుకుని వెళ్ళవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
ఎలా ఎంపిక చేస్తారు..?
వాక్ - ఇన్ - ఇంటర్వ్యూ విధానాలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 18,000 - 54,000 రూపాయలు వరకూ జీతం మరియు హౌస్ రెంటింగ్ అలోవెన్స్ (హెచ్. ఆర్. ఏ) సౌకర్యాలు కూడా లభించనున్నాయి.

0 Comments