గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కు చెందిన మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో ఉన్న నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(NMDC) లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.
3). భారీ స్థాయిలో వేతనం.
ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎన్ఎండీసీ నుండి వచ్చిన ఈ నోటిఫికేషన్ గురించి సవివరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : మార్చి 17, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ( పర్సనల్ ) - 22
మొత్తం ఖాళీలు :
22 ఖాళీలను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ /బోర్డుల నుండి సోషియాలజీ/సోషల్ వర్క్/లేబర్ వెల్ఫేర్/పర్సనల్ మానేజ్మెంట్/ఐఆర్/ఐఆర్పీఎం/హెచ్ఆర్/హెచ్ఆర్ఎం విభాగాలలో గ్రాడ్యుయేషన్/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా కోర్సులను పూర్తి చేయవలెను.
లేదా పర్సనల్ మానేజ్మెంట్/హెచ్ఆర్/హెచ్ఆర్ఎం విభాగాలలో ఎంబీఏ కోర్సులను పూర్తి చేసిన వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
మరియు నెట్ పరీక్షలో కూడా ఉత్తిర్ణత చెంది మార్కులు ఉండవలెను అని ప్రకటన లో తెలుపుతున్నారు. NMDC Jobs Recruitment 2022
వయసు :
27 సంవత్సరాలు వయసు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ /యూఆర్ కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎస్సీ /ఎస్టీ /దివ్యంగులు /ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు..?
నెట్ మార్కులు /గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 50,000 నుండి 1,80,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
0 Comments