Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP Guntur NID Jobs 2022 : జీతం 2,09,200 రూపాయలు వరకూ ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఆంధ్రప్రదేశ్, గుంటూరులో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.

ముఖ్యాంశాలు: 

1). ఇవి కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన ఉద్యోగాలు.

2). డైరెక్ట్ రిక్రూట్మెంట్ /డెప్యూటేషన్ /షార్ట్ టర్మ్ కాంట్రాక్టు బేసిస్ విధానంలో పోస్టుల భర్తీ.

3). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.

4). భారీ స్థాయిలో వేతనాలు.

ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

AP Guntur NID Jobs 2022

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏపీ స్టేట్ లో ఉన్న గుంటూరు నగరంలో లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

NID లో భర్తీ చేయనున్న ఈ పోస్టుల నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలను మనం ఇపుడు తెలుసుకుందాం. AP Guntur NID Jobs 2022

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : మార్చి 7, 2022.

విభాగాల వారీగా ఖాళీలు   :

పోస్ట్ లు ఖాళీలు
కంట్రోలర్ ఆఫ్ ఫైనాన్స్ & అకౌంట్స్ 1
ఫ్యాకల్టీ 7
సీనియర్ డిజైన్ ఇన్స్ట్రక్టర్ 1
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 1
అసోసియేట్ సీనియర్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్ 1
అసోసియేట్ సీనియర్ డిజైన్ ఇన్స్ట్రక్టర్ 1
డిప్యూటీ ఇంజనీర్ ( ఎలక్ట్రికల్ ) 1
టెక్నికల్ ఇన్స్ట్రక్టర్ 1
డిజైన్ ఇన్స్ట్రక్టర్ 1
అసిస్టెంట్ ఇంజనీర్ (ఐటీ ) 1

పోస్టులు :

16 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు  :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ /బోర్డుల నుండి సంబంధిత సబ్జెక్టు విభాగాలలో డిగ్రీ /డిప్లొమా /మాస్టర్ డిగ్రీ ఇన్ కామర్స్ /ఫైనాన్సియల్ మానేజ్మెంట్ /సీఏ తదితర కోర్సులను పూర్తి చేయవలెను.

మరియు కంప్యూటర్ నాలెడ్జ్,ఇంగ్లీష్ సబ్జెక్టు పై అవగాహన, మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

వయసు  :

కేటగిరీలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థుల వయసు 35 మరియు 56 సంవత్సరాలకు మించరాదు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఏజ్ రిలాక్స్యేషన్ ఉండే అవకాశం కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ ఈ మెయిల్ విధానంలో అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు   :

జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

ఎస్సీ /ఎస్టీ /దివ్యంగులు /మహిళలు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం  :

వ్రాత పరీక్ష / ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం  :

కేటగిరీలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 35,400 రూపాయలు నుండి 2,09,200 రూపాయలు వరకూ జీతం అందనుంది.

సంప్రదించవలసిన చిరునామా  :

The Chief Administrative Officer,

National Institute of Design Andhrapradesh,

Transit Campus : EEE & ECE Building,

Acharya Nagarjuna University, Nagarjuna Nagar,

Namburu,

Gunturu,

Andhrapradesh - 522510.

దరఖాస్తులు పంపవల్సిన ఈ మెయిల్ అడ్రస్ ( చిరునామా) :

recruitment@nid.ac.in

Website

Notification And Apply Link  

Post a Comment

0 Comments