రైల్వే ఎన్టీపీసీ మరియు గ్రూప్ - డీ పరీక్షల నిర్వహణపై ఇంకా డైలామా కొనసాగుతూనే ఉంది.
దేశావ్యాప్తంగా రైల్వే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులలో ఈ పరీక్షల నిర్వహణపై అనేకానేకా సందేహాలు నెలకొని ఉన్నాయి.
రైల్వే పరీక్షల నిర్వహణపై నెలకొని ఉన్న సందేహాలపై అభ్యర్థులు వారి వారి సందేహాలను తెలుపడానికి వీలుగా గత నెల ఫిబ్రవరి 16,2022 వ తేది వరకూ గ్రీవెన్స్ ను ఏర్పాటు చేసింది.
తదుపరి ఈ గ్రీవెన్స్ లో అందిన అభ్యర్థుల పిర్యాదులకు పరిష్కారం కనుగోనెందుకు వీలుగా ఒక కమిటీని భారతీయ రైల్వే బోర్డు నియమించినది.
రైల్వే బోర్డు నియమించిన ఈ కమిటీ తమ రిపోర్ట్ ను తయారుచేసి మార్చి 4వ తేదీ, 2022 నాడు డిపార్టుమెంటు అధికారులకు సబ్మిట్ చేయనుందని గతంలో ఒక ప్రకటన ద్వారా భారతీయ రైల్వే బోర్డు తెలిపినది. Railway Exam Dates New update 2022
అయితే, ఈ రోజు తాజాగా మార్చి 4వ తేది సందర్భంగా రైల్వే పరీక్షలకు సంబంధించిన అందిన పిర్యాదులను పరిశీలించిన రైల్వే సభ్యుల కమిటీ తమ నివేదికను భారతీయ రైల్వే బోర్డుకు అందించడం జరిగినట్లుగా అనధికారిక సమాచారం అందుతుంది.
దీనిని బట్టి చూస్తే, అతి త్వరలోనే మనకు రైల్వే ఎన్టీపీసీ మరియు గ్రూప్ డీ పరీక్షలకు సంబంధించిన అతి ముఖ్యమైన ప్రకటన విడుదల అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కావున, రైల్వే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మీ మీ పరీక్షల ప్రిపరేషన్ ను ఆపకుండా కొనసాగించడం మంచిది అని మనం చెప్పుకోవచ్చు.
0 Comments