ఇంపార్టెంట్ అప్డేట్, రైల్వే గ్రూప్ - డీ పోస్టుల విద్యా అర్హతలులో కీలక మార్పులు, ఇప్పుడే తెలుసుకోండి, షేర్ చేయండి.
రైల్వే గ్రూప్ - డీ ఉద్యోగాల భర్తీ విధి - విధానాలకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన అప్డేట్ ను ఇండియన్ రైల్వేస్ ఒక కీలక ప్రకటన ద్వారా అభ్యర్థులకు తాజాగా తెలిపినది.
ఇకపై భవిష్యత్తు రోజులలో భారతీయ రైల్వే ఆధ్వర్యంలో భర్తీ చేసే గ్రూప్ - డీ పోస్టుల భర్తీకి ఇప్పటివరకూ ఉన్నా విద్యా అర్హతలను మార్పు చేస్తున్నట్లుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ (రైల్వే బోర్డు) ఈ ప్రకటన లో పొందుపరిచినది.
15.6.2019 తరువాత ఇండియన్ రైల్వేస్ నుండి రాబోయే లెవెల్ - 1 పోస్టులకు 10వ తరగతి ఉత్తిర్ణతతో పాటుగా సివిల్ /మెకానికల్/ఎలక్ట్రికల్ & సిగ్నల్ /టెలికామ్ డిపార్టుమెంటు విభాగాలలో నేషనల్ అప్ప్రెంటీస్ షిప్ సర్టిఫికెట్ (NAC) గ్రాంటెడ్ బై నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (NCVT) లేదా 10వ తరగతి ప్లస్ ఐటీఐ కోర్సులను విద్యా అర్హతలుగా ఉండబోతున్నట్లుగా ఈ ప్రకటన ద్వారా అభ్యర్థులకు భారతీయ రైల్వే బోర్డు తెలిపింది.
రైల్వే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న దేశావ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అభ్యర్థులు ఈ ముఖ్యమైన విషయాన్నీ గమనించాలని మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ప్రకటనలో పొందుపరిచింది.
అయితే ఈ విద్యా అర్హతల నుండి గతంలో ఆర్ఆర్బీ బోర్డు నుండి వచ్చిన ఫిబ్రవరి 2018 మరియు మార్చి 2019 నోటిఫికేషన్స్ ను మినహాయిస్తున్నట్లుగా ఇండియన్ రైల్వేస్ తెలిపింది.
More Railway Jobs Click Here

0 Comments