తిరుపతి లో ప్రముఖ సంస్థలు రిలయన్స్, ముతూట్ ఫైనాన్స్, జస్ట్ డయాల్, ఆదిత్య బిర్లా గ్రూప్ లో ఖాళీగా ఉన్న 5000 కు పైగా పోస్టులను భర్తీ చేయడానికి గానూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలో ఉన్న SEICOM డిగ్రీ కాలేజ్, తిరుపతి నగరంలో మెగా గ్రాండ్ జాబ్ మేళా ను నిర్వహిస్తున్నట్లుగా ఒక ప్రకటన ద్వారా జాబ్ మేళా నిర్వాహకులు తెలిపారు.
ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలలో ప్రముఖ సంస్థలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
తిరుపతి నగరంలో నిర్వహించబోయే ఈ జాబ్ మేళా గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
మెగా జాబ్ మేళా నిర్వహణ తేదీలు : మార్చి 5 & 6, 2022.
మెగా గ్రాండ్ జాబ్ మేళా నిర్వహణ వేదిక :
SEICOM డిగ్రీ కాలేజీ, తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ Tirupati Jobs Recruitment 2022
జాబ్ మేళా లో పాల్గొను కంపెనీలు :
క్యూస్ కార్పొరేషన్ లిమిటెడ్
రిలయన్స్
హెచ్. జి. ఎస్
ఆదిత్య బిర్లా గ్రూప్
థింక్ సింక్
నోవాక్
ముతూట్ ఫైనాన్స్
జస్ట్ డయాల్
ఇవే కాకుండా ఇంకా చాలా ప్రముఖ సంస్థలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నట్లు ప్రకటనలో పొందుపరిచారు.
జాబ్ మేళా లో పాల్గొనే ఇండస్ట్రీస్ :
ఐటీ/ఐటీస్/బీపీఓ/కేపీఓ/ఎలక్ట్రానిక్ & ఎలక్ట్రికల్స్/మొబైల్ మాన్యూఫాక్చరింగ్/గార్మెంట్స్/ఆటో మొబైల్స్/ఇన్సూరెన్స్ మొదలైన ఇండస్ట్రీస్ జాబ్ మేళా లో పాల్గొననున్నాయి.
మొత్తం పోస్టులు :
ఈ జాబ్ మేళా ద్వారా పైన తెలిపిన ప్రముఖ సంస్థల్లో 5000 కు పైగా పోస్టులను అభ్యర్థులకు కల్పించనున్నారు.
అర్హతలు :
7వ తరగతి నుండి యూజి+పీజి వరకూ మరియు ఎనీ గ్రాడ్యుయేట్/ టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాలలో డిప్లొమా కోర్సులు, కామర్స్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్డ్ అభ్యర్థులు అందరూ ఈ గ్రాండ్ మెగా జాబ్ మేళా కు హాజరు కావచ్చును.
వయసు :
ఎటువంటి వయసు పరిమితి నిబంధనలను ఈ ప్రకటనలో తెలుపలేదు.
ఎంపిక విధానం :
జాబ్ మేళా ద్వారా ఇంటర్వ్యూ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 10,000 - 25,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
ఈ జీతంతో పాటుగా ఈఎస్ఐ+ఇన్సూరెన్స్+పీఎఫ్ వంటి తదితర అలోవెన్స్ లు కూడా లభించనున్నాయి.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
9494638229
7207857425
9985347488
మరిన్ని ఉద్యోగాల కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి Click Here
0 Comments