అద్భుతమైన అవకాశం, కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ, మళ్ళీ మళ్ళీ రాని అవకాశం, వెంటనే చూడండి.తిరుమల తిరుపతి దేవస్థానముకు చెందిన
శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్, ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్, టీటీడీ తిరుపతి లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1).ఎటువంటి పరీక్షల నిర్వహణ లేదు.
2). భారీ స్థాయిలో వేతనాలు.
3). మూడు సంవత్సరాల కాంట్రాక్చువల్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టుల భర్తీకి నిర్వహించబోయే ఇంటర్వ్యూలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ హాజరు కావచ్చును.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్, టీటీడీ లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
టీటీడీ నుండి తాజాగా జారీ అయినా ఈ పోస్టుల భర్తీ విధి - విధానాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. TTD Jobs 2022
ముఖ్యమైన తేదీలు :
వాక్ - ఇన్ - ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ : మార్చి 7, 2022.
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : ఉదయం 10 గంటలకు.
ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక :
శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్, టీటీడీ, తిరుపతి వద్ద కాన్ఫరెన్స్ హాల్.
విభాగాల వారీగా ఖాళీలు :
డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ - 3
అర్హతలు :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుండి ఎంబీబీఎస్ డిగ్రీ కోర్సులను పూర్తి చేయవలెను.
మెడికల్ ప్రాక్టీషనర్ గా తప్పనిసరిగా నమోదు అయి ఉండవలెను. పీడియాట్రిక్స్ లో పీజీ అర్హత/పీడియాట్రిక్ ఐసీయూ అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారని ప్రకటనలో పొందుపరిచారు.
సంబంధిత విభాగాలలో అనుభవం మరియు హిందూ మతాన్ని అవలంబిస్తున్న అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
ఎటువంటి వయసు పరిమితి నిబంధనలను ఈ ప్రకటనలో పొందుపరచలేదు.
దరఖాస్తు ఫీజు :
ఎలాంటి దరఖాస్తు ఫీజులు లేవు.
ఎలా ఎంపిక చేస్తారు..?
కేవలం వాక్ - ఇన్ - ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 60,000 రూపాయలు జీతం లభించనుంది.
మరిన్ని ఉద్యోగాల కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి Click Here
0 Comments