ఆన్లైన్ ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపికలు, అస్సలు మిస్ కావద్దు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR) ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషేనోగ్రాఫి, రీజినల్ సెంటర్ విశాఖపట్నం నగరంలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇవి నేషనల్ ఇన్స్టిట్యూట్ కు చెందిన పోస్టులు.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
3). భారీ స్థాయిలో వేతనాలు.
4). టెంపరరీ కాంట్రాక్టు బేసిస్ లో పోస్టుల భర్తీ.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వైజాగ్ నుండి వచ్చిన ఈ నోటిఫికేషన్ లో పొందుపరిచిన ఈ పోస్టుల భర్తీ విధి - విధానాలను గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. Vizag CSIR Recruitment 2022
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ ఈ మెయిల్ దరఖాస్తులకు చివరి తేది : మార్చి 7, 2022.
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు : మార్చి 15, 2022.
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : 10AM & 2PM
విభాగాల వారీగా ఖాళీలు :
ప్రాజెక్ట్ అసోసియేట్స్ - 1 - 3
అర్హతలు :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మైక్రో బయాలజీ /మెరైన్ మైక్రో బయాలజీ /ఆక్వాటిక్ సైన్సెస్/బయోలాజికల్ సైన్సెస్ /మెరైన్ కెమిస్ట్రీ/హైడ్రో కెమిస్ట్రీ/ఎన్విరాన్ మెంటల్ సైన్సెస్/కెమికల్ ఓసెనోగ్రాఫి విభాగాలలో ఎంఎస్సీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
35 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వారి వారి అప్లికేషన్ ఫారంలకు సంబంధిత విద్యా ధ్రువీకరణపత్రాలను జతపరచి ఆన్లైన్ విధానంలో ఈ క్రింది ఈ మెయిల్ అడ్రస్ కు పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు..?
షార్ట్ లిస్ట్, ఆన్లైన్ ఇంటర్వ్యూల (స్కైప్ /గూగుల్ మీట్ /జూమ్ ) విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 25,000-28,000 రూపాయలు వరకూ లభించనుంది.
ఈ జీతంతో పాటుగా హౌస్ రెంటింగ్ అలోవెన్స్ లు కూడా లభించనున్నాయి.
Apply Email Adress :
hrdg@nio.org
మరిన్ని ఉద్యోగాల కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి Clink Here
0 Comments