Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP Govt Jobs 2022 Telugu : ప్రభుత్వ ఉద్యోగాలు, జీతం 28,000, పరీక్ష లేదు,10 రోజులలో పోస్టింగ్స్

పరీక్ష లేదు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కడప లో , వెను వెంటనే అప్లై చేసుకోండి.

గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కడపలో  వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.

ముఖ్యాంశాలు: 

1). ఇవి రాష్ట్ర ప్రభుత్వ విభాగానికి చెందిన పోస్టులు.

2). ఇవి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ బేసిస్ పోస్టులు.

3). భారీ స్థాయిలో వేతనాలు.

4).దరఖాస్తు ప్రక్రియ ముగిసిన 10రోజుల లోపే పోస్టింగ్స్ ఇవ్వబడడం అభ్యర్థులకు మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు.

AP Govt Jobs 2022 Telugu

ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏపీ రాష్ట్రం కడప  జిల్లాలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

తాజాగా వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన అంశాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. AP Govt Jobs 2022 Telugu

ముఖ్యమైన తేదీలు  :

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరడానికి చివరి తేది  :  ఏప్రిల్ 29, 2022.

ప్రోవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేది                               :   మే 2, 2022

ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేది                                       :    మే 5, 2022

అప్పోయింట్మెంట్ ఆర్డర్స్ తేది                                           :    మే 7, 2022

జాయినింగ్ తేది                                                                     :    మే 10, 2022

విభాగాల వారీగా ఖాళీలు  :

పోస్ట్ లు ఖాళీలు
సీటీ టెక్నీషియన్ 1
కేత్ ల్యాబ్ టెక్నీషియన్ 2
పెర్ఫ్యూసినిస్ట్ 2
వైర్ మెన్ & ఎలక్ట్రీషియన్ 1
రేడియోగ్రాఫర్ 2
ఈసీజీ టెక్నీషియన్ 6
స్పీచ్ థెరపిస్ట్ 1
డయాలసిస్ టెక్నీషియన్ 3
ఈసీజీ టెక్నీషియన్ 1
ఫార్మసిస్ట్ ( గ్రేడ్ - II ) 1
ల్యాబ్ టెక్నీషియన్ ( గ్రేడ్ - II) 1
డీఈఓ 1

మొత్తం పోస్టులు :

18 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ / బాచిలర్ ఆఫ్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ /పీజీ డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వారు సీటీ టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి కేత్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు కేత్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసుకోవాలి.

బీ. ఎస్సీ ఇన్ బయాలజికల్ సైన్స్ మరియు ఒక సంవత్సరం క్లినికల్ పెర్ఫ్ యూసర్ సర్టిఫికెట్ కోర్సు కంప్లీట్ అయిన వారు పెర్ఫ్యూసినిస్ట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

10వ తరగతి మరియు ఐటీఐ ఎలక్ట్రీషియన్ కోర్సులను పూర్తి చేసిన వారు వైర్ మెన్ /ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంటర్మీడియట్ మరియు టూ ఇయర్స్ డీఎంఐటీ కోర్సులను కంప్లీట్ చేసిన వారు రేడియోగ్రాఫర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంటర్మీడియట్ + ఈసీజీ లో 6 నెలల ట్రైనింగ్ కోర్సును పూర్తి చేసిన వారు ఈసీజీ టెక్నీషియన్ పోస్టుకు అర్హులు అని తెలుపుతున్నారు.

బాచిలర్ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాతోలజీ కోర్సులు కంప్లీట్ అయినవారు స్పీచ్ థెరపిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

డిప్లొమా /బీఎస్సీ ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ కోర్సును పూర్తి చేసిన వారు డయాలసిస్ టెక్నీషియన్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంటర్మీడియట్ + 6 నెలల ట్రైనింగ్ కోర్సు ఇన్ ఈసీజీ కంప్లీట్ అయిన వారు ఈసీజీ టెక్నీషియన్ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు.

10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విత్ సైన్స్ గ్రూప్ /డీ - ఫార్మసీ /బీ - ఫార్మసీ తదితర కోర్సులు పూర్తి చేసిన వారు ఫార్మసిస్ట్ ( గ్రేడ్ - II ) పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఇంటర్మీడియట్ విత్ డీఎంఎల్టీ కోర్సు / ఇంటర్ ఒకేషనల్ క్లినికల్ ట్రైనింగ్ /బీఎస్సీ విత్ బీజెడ్సీ /ఎంఎల్టీ కోర్సును పూర్తి చేసిన వారు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ - II ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ మరియు ఒక సంవత్సరం పీజీడీసీఏ కంప్యూటర్ కోర్సులను పూర్తి చేసిన వారు డీఈఓ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

బ్యాంక్ ఉద్యోగాలు మరియు తిరుపతి TTD లో ఉద్యోగాలు స్టోర్స్ చూడండి Click Here

వయసు :

18 నుండి 42 సంవత్సరాలు వరకూ వయసు గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ /బీసీ/ews కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆఫ్ లైన్ విధానంలో ఈ క్రింది చిరునామాకూ నిర్ణిత గడువు చివరి తేది లోగా అభ్యర్థులు తమ తమ దరఖాస్తులను రిజిస్టర్డ్ లేదా ప్రత్యక్షంగా గానీ అందించవలెను.

దరఖాస్తు ఫీజు :

300 రూపాయలను దరఖాస్తు ఫీజుగా అభ్యర్థులు చెల్లించవలెను.

ఎలా ఎంపిక చేస్తారు:

విద్యా అర్హతలు మార్కులు, సర్వీస్ మరియు కోర్సు వెయిటేజ్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం  :

కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకూ నెలకు జీతంగా 15,000రూపాయలు నుండి 28,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

దరఖాస్తులు పంపవల్సిన చిరునామా  :

To The Office of the Superintendent,

Government General Hospital,

Kadapa.

Notification

Apply Now and website Link

Post a Comment

0 Comments