గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తో మహరత్న సంస్థ గా గుర్తింపు పొందిన ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC)లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న అప్ప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయడానికి గానూ ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
దేశావ్యాప్తంగా ఉన్న సెక్టార్ లు అన్నిటిలో విభాగాల వారీగా ఖాళీగా ఉన్న అప్ప్రెంటిస్ ఖాళీలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
ముఖ్యాంశాలు:
1). భారీ సంఖ్యలో అప్ప్రెంటీస్ ఖాళీల భర్తీ.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
3). గౌరవ స్థాయిలో స్టైఫండ్ లు ఇవ్వనున్నారు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఏపీ లో గల రాజమండ్రి మరియు కాకినాడ ఓఎన్జీసీ సంస్థలలో అప్ప్రెంటీస్ షిప్ అవకాశాలు కల్పించనున్నారు.
ONGC నుండి వచ్చిన ఈ ప్రకటన గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. ONGC Vacancies 2022 Telugu
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : ఏప్రిల్ 27, 2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : మే 15, 2022 ( మే 22, 2022 )
రిజల్ట్స్ / సెలక్షన్ విడుదల తేది : మే 23, 2022
సెక్టార్ల వారీగా ఖాళీలు :
పొస్ట్ లు | ఖాళీలు |
---|---|
నార్త్ర్న్ సెక్టార్ | 209 |
ముంబై సెక్టార్ | 305 |
వెస్ట్రన్ సెక్టార్ | 1434 |
ఈస్ట్రన్ సెక్టార్ | 744 |
సౌథెర్న్ సెక్టార్ | 694 |
సెంట్రల్ సెక్టార్ | 228 |
మొత్తం ఖాళీలు :
దేశావ్యాప్తంగా 3614 అప్ప్రెంటీస్ ఖాళీలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
తెలుగు రాష్ట్రాలకు విభాగాల వారీగా కేటాయించిన ఖాళీలు :
కాకినాడ :
పొస్ట్ లు | ఖాళీలు |
---|---|
అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ | 2 |
ఆఫీస్ అసిస్టెంట్ | 2 |
కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ | 12 |
డ్రాట్స్ మెన్ ( సివిల్ ) | 2 |
ఎలక్ట్రీషియన్ | 12 |
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ | 4 |
ఫిట్టర్ | 11 |
ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ | 6 |
మెకానిక్ డీజిల్ | 3 |
రిఫ్రిజీరేషన్ అండ్ ఏసీ మెకానిక్ | 4 |
రాజమండ్రి :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ | 10 |
ఆఫీస్ అసిస్టెంట్ | 40 |
కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ | 10 |
డ్రాట్స్ మెన్ ( సివిల్ ) | 14 |
ఎలక్ట్రీషియన్ | 50 |
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ | 15 |
ఫిట్టర్ | 55 |
ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ | 20 |
ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్ సిస్టం మెయింటైనెన్స్ | 5 |
లేబర్యాటరీ అసిస్టెంట్ ( కెమికల్ ప్లాంట్ ) | 20 |
మెషినిస్ట్ | 7 |
మెకానిక్ ( మోటార్ వెహికల్ ) | 4 |
మెకానిక్ డీజిల్ | 40 |
రిఫ్రిజీరేషన్ & ఏసీ మెకానిక్ | 6 |
వెల్డర్ | 20 |
ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్ | 7 |
ఎలక్ట్రికల్ | 20 |
మెకానికల్ | 10 |
మొత్తం ఖాళీలు :
రాజమండ్రి లో 353 అప్ప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి సంబంధిత విభాగాలలో బాచిలర్ డిగ్రీ( గ్రాడ్యుయేషన్)/బీ. కామ్ /బీఏ/బీబీఏ/బీ. ఎస్సీ/ఐటీఐ/డిప్లొమా తదితర కోర్సులను పూర్తి చేయవలెను అని ఈ ప్రకటనలో తెలిపారు.
Note : బ్యాంక్ ఉద్యోగాలు మరియు తిరుపతి TTD లో ఉద్యోగాలు స్టోర్స్ చూడండి Click Here
వయసు :
18-24 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
ఎలా ఎంపిక చేస్తారు:
విద్య అర్హతలు, క్వాలిఫయింగ్ మార్కుల మరియు మెరిట్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
స్టై ఫండ్ :
కేటగిరీ లను అనుసరించి ఈ అప్ప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకి నెలకు 7,700 నుండి 9,000 రూపాయలు వరకూ స్టై ఫండ్స్ లభించనున్నాయి.
ONGC పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి తేది పొడిగింపు :
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మహరత్న సంస్థ గా గుర్తింపు పొందిన ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC)లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారుగా 3614 అప్ప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయడానికి గానూ ఒక అతి ముఖ్యమైన ప్రకటన విడుదల అయిన సంగతి మనకు తెలిసిందే.
ఇప్పటికే ఈ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన వెబ్సైటు లో పూర్తి సమాచారంను అభ్యర్థులకు అందించడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ నగరంలో 58 మరియు రాజమండ్రి నగరంలో 353 ఓఎన్జీసీ అప్ప్రెంటీస్ షిప్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
దేశావ్యాప్తంగా ఉన్న సెక్టార్ లు అన్నిటిలో విభాగాల వారీగా ఖాళీగా ఉన్న అప్ప్రెంటిస్ ఖాళీలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు గడువును పెంచుతూ మరియు వయస్సు పరిమితులలో మార్పుల గురించి ఓఎన్జీసీ తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా అభ్యర్థులకు తెలిపింది.
తాజాగా వచ్చిన ప్రకటనలో పొందుపరిచిన ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : మే 22, 2022.
మొత్తం పోస్టులు :
వివిధ విభాగాలలో 3614 అప్ప్రెంటీస్ పోస్టులను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
వయసు :
18 నుండి 28 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు అని తాజాగా వచ్చిన ఈ ప్రకటనలో తెలిపారు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు అని ఈ ప్రకటనలో తెలిపారు.
గమనించవలసిన విషయం :
2019,2020,2021 మరియు 2022 సంవత్సరాలలో సంబంధిత కోర్సులు పూర్తి అయిన అభ్యర్థులు మాత్రమే డిప్లొమా అప్ప్రెంటీస్ పోస్టులకు అప్లై చేసుకోవలెను అని ఈ ప్రకటనలో తెలిపారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
0 Comments