8.72 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై భారత ప్రధాని చేసిన అత్యంత ముఖ్యమైన ప్రకటన
భారత కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న 77 మంత్రిత్వ శాఖలు మరియు డిపార్టుమెంటులలో 2020 మార్చి నెల వరకూ ఖాళీగా ఉన్న 8,72,243 ఖాళీలను వెను వెంటనే భర్తీ చేయాలని భారతదేశ ప్రధాన మంత్రివర్యులు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది.
గడిచిన శనివారం నాడు న్యూ ఢిల్లీ నగరంలో జరిగిన ఒక సమీక్షలో స్వయానా భారత ప్రధాని కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్యను గురించి ఆరా తీసి,
వెంటనే వివిధ శాఖలలో ఖాళీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అన్నిటిని భర్తీ చేయడానికి చర్యలను తీసుకోవాలని, 2024 వ సంవత్సరం లోపు ఈ 8,72,243 ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ముగించాలని ప్రధాని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. Central Govt Jobs
గడిచిన నెలలో కేంద్ర ప్రభుత్వ శాఖ మంత్రివర్యులు పార్లమెంట్ లో వెల్లడించిన గణంకాల ప్రకారం కొన్ని శాఖలలో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
విభాగాల వారీగా ఉద్యోగాల ఖాళీలు :
భారతీయ రైల్వే శాఖ - 2,94,687
రక్షణ శాఖ - 2,47,502
హోం శాఖ - 1,28,842
పోస్టల్ శాఖ - 90,050
రెవిన్యూ శాఖ - 76,323
పైన తెలిపిన శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు, మరియు 2020 వ సంవత్సరం మార్చి నెల తరువాత శాఖల వారీగా ఏర్పడిన రిటైర్ మెంట్ ఖాళీలు అన్నిటిని కలుపుకుంటే దాదాపుగా 8 లక్షలకు పైబడే కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాల ఖాళీలు ఉండనున్నట్లుగా మనకు తెలుస్తుంది.
ఈ ఉద్యోగాల భర్తీకి స్వయానా భారత ప్రధాని మంత్రివర్యులే పచ్చ జెండా (గ్రీన్ సిగ్నల్ ) ఇవ్వడంతో, వీలైనంత త్వరలోనే ఈ 8 లక్షల సెంట్రల్ గవర్నమెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికెషన్స్ విడుదల కానున్నట్లుగా మనకు తెలుస్తుంది.
AP లో మరిన్ని ఉద్యోగాలు Click Here
TS లో మరిన్ని జాబ్స్ Click Here

0 Comments