TS రాష్ట్రంలో ఉన్న పోలీస్ శాఖలో కానిస్టేబుళ్లకు పదోన్నతులు కల్పించడంలో భాగంగా తెలంగాణ పోలీస్ శాఖ తాజాగా ఉత్తర్వులను జారీ చేసినది.
తెలంగాణ రాష్ట్రంలో ఏఆర్ నుండి సివిల్ కు కన్వెర్షన్ కు సంబంధించిన కసరత్తులను పూర్తి చేసిన ఉన్నతాధికారులు పూర్తి చేసినట్లుగా మనకు తెలుస్తుంది. Head Constable Update
రాష్ట్రం పోలీస్ శాఖలో ప్రస్తుతం హెడ్ కానిస్టేబుల్ ల స్థాయిలో సుమారుగా 3300 ఖాళీలు ఉండగా, గడిచిన రోజుల క్రితం 1300 మందికి మరియు తాజాగా మరొక 1600 మందికి హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతి కల్పించినట్లు ఈ ఉత్తర్వులలో అధికారులు పొందుపరిచారు.
మరోవైపు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 18వేల వరకూ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే వీలున్నట్లు సీపీ ఒక ప్రకటనలో తెలిపినట్లుగా తెలుస్తుంది.
హైదరాబాద్ నగరంలో 3300 వరకూ పోలీస్ పోస్టుల భర్తీ జరుగ వచ్చునని సీపీ అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

0 Comments