తిరుపతి, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి అర్హులైన దివ్యాంగుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుగా ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి నాన్ - టీచింగ్ పోస్టులు.
2). యూనివర్సిటీలో ఉద్యోగాలు.
3). 5వ తరగతి అర్హతలతో కూడా పోస్టుల భర్తీ.
4).భారీ స్థాయిలో వేతనాలు.
5). ఈ పోస్టులను పేర్మినెంట్ గా కూడా చేసుకునే అవకాశం ఉండనుంది.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన చిత్తూరు జిల్లాకు చెందిన దివ్యంగులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
తిరుపతి నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన అంశాలను గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : ఏప్రిల్ 30, 2022. (5 PM).
విభాగాల వారీగా ఖాళీలు :
| పోస్ట్ లు | ఖాళీలు |
|---|---|
| జూనియర్ అసిస్టెంట్ | 1 |
| వర్క్ ఇన్స్పెక్టర్ | 1 |
| ఆఫీస్ సబ్ఆర్డినేట్ | 4 |
| క్లీనర్ ( హాస్టల్ ) | 1 |
| హెల్పర్ ( హాస్టల్ ) | 1 |
| వాచ్ మెన్ | 1 |
| ఆయా | 1 |
పోస్టులు :
మొత్తం 10 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి బాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ /కామర్స్ / సైన్స్ కోర్సులను పూర్తి చేసి, ఇంగ్లీష్ / తెలుగు హయ్యర్ గ్రేడ్ టైప్ రైటింగ్ అర్హతలు కలిగి ఉన్న అభ్యర్థులు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్ఎస్ఎల్సీ కంప్లీట్ చేసి, మేజర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో 5 సంవత్సరాలు అనుభవం ఉన్న అభ్యర్థులు అందరూ వర్క్ ఇన్స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
7వ తరగతి పాస్ అయ్యి, సైకిల్ వచ్చిన వారందరూ ఆఫీస్ సబ్ ఆర్డినేట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
చదవడం మరియు వ్రాయడం వచ్చి, రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ క్లీనర్ ( హాస్టల్ ) పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
5 వ తరగతి విద్యా అర్హతలుగా కలిగి ఉండి, కుకింగ్ లో రెండు సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులు అందరూ హెల్పర్ ( హాస్టల్ ) పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎనిమిదవ తరగతి పాస్ అయ్యి, 6.8 సెంటీ మీటర్ల ఎత్తు మరియు 81-86 సెంటీ మీటర్ల చెస్ట్ కలిగి ఉన్న అభ్యర్థులు వాచ్ మెన్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎటువంటి విద్యా అర్హతలు లేని అభ్యర్థులు కూడా ఆయా ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
వయసు :
18-34 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
అన్ని కేటగిరీ ల అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకూ వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆఫ్ లైన్ విధానంలో అభ్యర్థులు ఈ క్రింది అడ్రస్ కు తమ తమ దరఖాస్తు ఫారంలను, 30 రూపాయలు విలువ చేసే స్టాంప్ లతో ఈ క్రింది చిరునామా కు నిర్ణిత గడువు చివరి తేదీలోగా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
అప్లికేషన్ ఫీజు 50 రూపాయలు మరియు రిజిస్ట్రేషన్ ఫీజు 50 రూపాయలును అభ్యర్థులు దరఖాస్తు ఫీజులుగా డీడీ రూపంలో చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు :
విద్యా అర్హతలు మెరిట్ / ఇంటర్వ్యూ విధానములను ఆధారంగా చేసుకుని ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 20,000 రూపాయలు నుండి 80,910 రూపాయలు వరకూ జీతములు లభించనున్నాయి.
దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ :
To The Register,
S. V. University,
Tirupati,
Andhra Pradesh
మరోక నోటిఫికేషన్ Tirupati TTD లో ఉద్యోగాలు Click Here

0 Comments