డాక్టర్ వై. ఎస్. ఆర్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ - విశాఖపట్నం జిల్లాలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ఈ ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జిల్లా వైద్య & ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం నుండి విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1).ఇవి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పోస్టులు.
2). లోకల్ మరియు నాన్ - లోకల్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
3). గౌరవ స్థాయిలో వేతనాలు.
4). అవుట్ సోర్సింగ్ విధానంలో పోస్టుల భర్తీ.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటనలో పొందుపరిచారు
వైజాగ్ నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన వివరాలు అన్నిటిని మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. Vizag Jobs 18,500 Salary
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : ఏప్రిల్ 7 , 2022 ( సాయంత్రం 5 గంటలు).
విభాగాల వారీగా ఖాళీలు :
ఆరోగ్య మిత్ర - 29
టీమ్ లీడర్స్ - 3
మొత్తం పోస్టులు :
32 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి బీఎస్సీ (నర్సింగ్ )/ ఎంఎస్సీ (నర్సింగ్ )/బీ. ఫార్మసీ / ఫార్మా డీ /బీ. ఎస్సీ (మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ) మొదలైన కోర్సులను పూర్తి చేసి అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యములు, తెలుగు మరియు ఆంగ్లంపై పరిజ్ఞానం కలిగి ఉండి, కంప్యూటరైజ్డ్ డేటా సేకరణ నిర్వహణ రిపోర్టింగ్ మరియు అనాలిసిస్ లో అనుభవం కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
42 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం బీసీ/ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో వెబ్సైటు ద్వారా దరఖాస్తు ఫారం ను మొదట డౌన్లోడ్ చేసుకుని, ఆ దరఖాస్తు ఫారం ను నింపి తదుపరి, అప్లికేషన్ ఫారం నకు సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలను జతపరచి నిర్ణిత గడువు చివరి తేది లోగా ఈ క్రింది అడ్రస్ లో ఉన్న డ్రాప్ బాక్స్ నందు సమర్పించవలెను.
దరఖాస్తు ఫీజు :
200 రూపాయలు దరఖాస్తు ఫీజుగా అభ్యర్థులు చెల్లించవలెను.
జతపరచవలసిన కాపీలు :
సంబంధిత విద్యా అర్హతల మార్కుల జాబితా
తాత్కాలిక పాస్ సర్టిఫికెట్స్
డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్
తాజా కుల దృవీకరణ పత్రం
4-10వ తరగతి వరకూ స్టడీ సర్టిఫికెట్స్
సర్వీస్ సర్టిఫికెట్స్
మొదలైన సర్టిఫికెట్స్ ను గేజీటెడ్ ఆఫీసర్స్ చేత అటెస్టడ్ చేయించి అప్లికేషన్ ఫారం నకు జతపరచి పంపవలెను అని ఈ ప్రకటనలో తెలిపారు.
ఎలా ఎంపిక చేస్తారు:
విద్యా అర్హతల మార్కులు / మెరిట్ ను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఆరోగ్య మిత్ర పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 15,000 రూపాయలు మరియు టీమ్ లీడర్స్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 18,500 రూపాయలు వరకూ జీతం అందనుంది.
దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ ( చిరునామా ) :
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి,
విశాఖపట్నం,
ఆరోగ్య శ్రీ జిల్లా కో ఆర్డినేటర్ కార్యాలయం,
ఆంధ్రప్రదేశ్.

0 Comments