పోస్టల్ శాఖ పేరుతో వాట్సాప్ మెసెజ్ లు, 6,000 రూపాయలు వరకూ నగదు బహుమతులు, సామాజిక మాధ్యమాల ద్వారా ఆన్లైన్ లింక్ లు హల్చల్, నిజమెంత..? అబద్దమెంత..?, ఇప్పుడు తెలుసుకుందాం.
మనం స్మార్ట్ ఫోన్లలో నిత్యం వాడే వాట్సాప్, టెలిగ్రామ్, ఇంస్టాగ్రామ్, మెయిల్స్ మరియు పలు వెబ్సైటుల వంటి సామాజిక మాధ్యమాల ద్వారా తాజాగా గడిచిన కొన్ని రోజుల నుండి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ కు చెందిన పోస్టల్ శాఖ పేరుతో ఒక లింక్ సెండ్ చేయబడుతుంది.
పోస్టల్ శాఖ పేరుతో సెండ్ చేసిన ఈ లింక్ ను ఓపెన్ చేసిన వెంటనే సుమారుగా 6,000 రూపాయలు వరకూ నగదు బహుమతిగా ఇస్తున్నామని, ఆ 6,000 రూపాయలు నగదు మీరు అందుకోవాలంటే, సదరు ఆన్లైన్ లింక్ ను 20 మంది స్నేహితులకు లేదా 5వాట్సాప్ గ్రూప్ లకు ఫార్వర్డ్ చేయమని తెలుపుతుంది. Postal Gift Update
గత కొన్ని రోజుల నుండి వాట్సాప్, ఇంస్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా యాప్ లలో ఫార్వర్డ్ అవుతున్న ఈ ఆన్లైన్ లింక్ లపై తాజాగా ఇండియన్ పోస్ట్ ఆఫీస్ కు చెందిన చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఒక అతి ముఖ్యమైన ప్రకటనను చేశారు.
ప్రభుత్వ మరియు బ్యాంక్ ఉద్యోగాల సమాచరం కొరకు స్టోర్స్ చూడండి. Click Here
తాజాగా వాట్సాప్, ఇంస్టాగ్రామ్, వెబ్సైటు ల ద్వారా కొన్ని సర్వేలు, క్విజ్ ల ద్వారా నగదు మరియు ఇతర బహుమతులను అందిస్తున్నట్లుగా ప్రజలను మభ్య పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది అని, ప్రజలందరూ ఈ విషయాలపై జాగ్రత్తగా ఉండాలని,
తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఆన్లైన్ లింక్ లకు, ఇండియన్ పోస్టల్ శాఖకు ఎటువంటి సంబంధం లేదని, ప్రజలందరూ ఈ నకిలీ దందాల విషయమును గ్రహించాలని, ఈ ప్రకటన ద్వారా చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ స్పష్టం చేశారు.
0 Comments