భారత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కు చెందిన డిపార్టుమెంటు ఆఫ్ పోస్ట్స్, ఇండియా, ముంబై లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1).ఇరు తెలుగు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
2).వీటిని పేర్మినెంట్ గా కూడా చేసుకునే అవకాశం కలదు.
3). ఇవి కేంద్రప్రభుత్వమునకు సంబంధించిన గ్రూప్ - సీ విభాగమునకు చెందిన నాన్ - గేజీటెడ్, నాన్ - మినిస్ట్రీయల్ పోస్టులు.
4). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.
ఇండియన్ పోస్ట్స్ నుండి వచ్చిన ఈ తాజా ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన అంశాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : మే 9, 2022 ( 5PM).
విభాగాల వారీగా ఖాళీలు :
మెకానిక్ ( మోటార్ వెహికల్ ) - 5, ఎలక్ట్రీషియన్-2,టైర్ మెన్-1,బ్లాక్ స్మిత్,1
మొత్తం పోస్టులు :
9 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన గవర్నమెంట్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ నుండి సంబంధిత ట్రేడ్ విభాగాలలో సర్టిఫికెట్ పొంది ఉండవలెను. లేదా 8వ తరగతి పాస్ అయ్యి, సంబంధిత ట్రేడ్ విభాగాలలో ఒక సంవత్సరం అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.
మెకానిక్ (మోటార్ వెహికల్ ) పోస్టుకు అప్లై చేసుకునే అభ్యర్థులు హెవీ వెహికల్స్ ను డ్రైవ్ చేయడానికి గానూ వాలీడ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
18-30 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
అభ్యర్థులు మొదట ఈ క్రింది ఆన్లైన్ వెబ్సైటు నుండి దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకుని, ఆ తరువాత దరఖాస్తు ఫారం ను నింపి, నింపిన అప్లికేషన్ ఫారంనకు సంబంధిత విద్యా ధ్రువీకరణ మరియు ఇతర సంబంధిత ధ్రువీకరణ పత్రాలను జతపరచి నిర్ణిత గడువు చివరి తేదీలోగా ఈ క్రింది చిరునామా (అడ్రస్ ) కు ఆఫ్ లైన్ విధానంలో స్పీడ్ పోస్ట్ ద్వారా /రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను ఈ ప్రకటనలో తెలుపలేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
విద్యా అర్హతలు మరియు కాంపీటీటీవ్ ట్రేడ్ టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు లెవెల్ -2, 7th సీపీసీ ను అనుసరించి ప్రారంభ జీతంగా నెలకు 19,900 రూపాయలు వరకూ అందనుంది.
దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ ( చిరునామా ) :
The senior manager (JAG),
Mail Motor Service, 134-A,
Sudam Kalu Ahire Marg,
Worli, Mumbai - 400018.
0 Comments