Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

SBI Jobs Recruitment 2022 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో జాబ్స్, ప్రారంభ జీతం 36,000 తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు

ప్రముఖ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు చెందిన సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్టుమెంటు లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్యాంశాలు:

1). ఇవి బ్యాంక్ కు సంబంధించిన ఉద్యోగాలు.

2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.

3). భారీ స్థాయిలో వేతనాలు.

4). రెగ్యులర్ / కాంట్రాక్టు బేసిస్ లో పోస్టుల  భర్తీ జరుగనుంది.

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

SBI Jobs Recruitment 2022

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు న్యూ ఢిల్లీ నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

ఎస్బీఐ నుండి వచ్చిన ఈ తాజా ప్రకటనలో పొందుపరిచిన ముఖ్యమైన అంశాలు అన్నిటిని మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. SBI Jobs Recruitment 2022

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది   :    ఏప్రిల్ 27, 2022

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది         :    మే 17, 2022

ఆన్లైన్ టెస్ట్ నిర్వహణ తేది                 :    జూన్ 25, 2022

ఆన్లైన్ టెస్ట్ కాల్ లెటర్స్ డౌన్లోడ్ తేది    :    జూన్ 16, 2022

విభాగాల వారీగా ఖాళీలు   :

రెగ్యులర్ పొజిషన్స్  :

పోస్ట్ లు ఖాళీలు
సిస్టమ్ ఆఫీసర్ ( టెస్ట్ ఇంజనీర్ ) 2
సిస్టమ్ ఆఫీసర్ ( వెబ్ డెవలపర్ ) 1
సిస్టమ్ ఆఫీసర్ (పెర్ఫార్మన్స్ ఇంజనీర్) 1
సిస్టమ్ ఆఫీసర్ ( ప్రాజెక్ట్ మేనేజర్ ) 2
సిస్టమ్ ఆఫీసర్ ( ప్రాజెక్ట్ మేనేజర్ ) 1

కాంట్రాక్టు పోజిషన్స్   :

పోస్ట్ లు ఖాళీలు
ఎగ్జిక్యూటివ్ ( టెస్ట్ ఇంజనీర్ ) 10
ఎగ్జిక్యూటివ్ (ఇంటరేక్షన్ డిజైనర్) 3
ఎగ్జిక్యూటివ్ ( వెబ్ డెవలపర్ ) 1
ఎగ్జిక్యూటివ్ ( పోర్టల్ అడ్మినిస్ట్రేటర్) 3
సీనియర్ ఎగ్జిక్యూటివ్(పెర్ఫార్మన్స్ ఇంజనీర్) 4
సీనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంటరేక్షన్ డిజైనర్) 2
సీనియర్ ఎగ్జిక్యూటివ్ ( ప్రాజెక్ట్ మేనేజర్ ) 4
సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ ( ప్రాజెక్ట్ మేనేజర్) 1

మొత్తం పోస్టులు  :

35 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి బీఈ/బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ /కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ /ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ /సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ /ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఎంసీఏ లేదా ఎంటెక్ /ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ /ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా సమాన విద్య అర్హతలు కలిగిన వారందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

వయసు :

విభాగాలను అనుసరించి 40 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం అభ్యర్థులకు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు  :

జనరల్ /ఓబీసీ /ews కేటగిరీ అభ్యర్థులు 750 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

ఎస్సీ /ఎస్టీ /దివ్యాంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు అందరూ ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు:

ఆన్లైన్ ఎగ్జామినేషన్ / షార్ట్ లిస్ట్ / ఇంటర్వ్యూల నిర్వహణ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

పరీక్ష - సిలబస్ వివరాలు :

ఆన్లైన్ ఎగ్జామినేషన్ లో రీసనింగ్, క్వాంటీటేటివ్ అప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఐటీ నాలెడ్జి, రోల్ బేస్డ్ నాలెడ్జ్ అంశాలపై ప్రశ్నలను ఇవ్వనున్నారు.

జీతం :

కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 36,000 రూపాయలు నుండి 89,890 రూపాయలు వరకూ జీతం అందనుంది.

కొన్ని విభాగాల ఉద్యోగాలకు సంవత్సరానికి 27 లక్షల రూపాయలు వరకూ జీతం అందనుంది.

ఈ జీతములతో పాటుగా డీఏ + హెచ్. ఆర్. ఏ + సీసీఏ+పీఎఫ్ + కాంట్రిబ్యూటరి పెన్షన్ ఫండ్ + ఎల్ఎఫ్సీ + మెడికల్ ఫెసిలిటీ తదితర బెనిఫిట్స్, సౌకర్యాలు కూడా లభించనున్నాయి.

Apply Link

Notification

Post a Comment

0 Comments