తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 80,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక ప్రకటన తాజాగా విడుదల అయిన సంగతి మనకు తెలిసిందే.
ఇందులో భాగంగానే, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ ( టీఎస్ ఆర్టీసీ ) ఒక శుభవార్త ను తాజాగా ప్రకటించినది.
తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన ఈ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గానూ, ప్రిపేర్ అవ్వడానికి అభ్యర్థులు కోచింగ్ సెంటర్లకు వెళుతున్నారు.
ఈ నేపథ్యంలో గవర్నమెంట్ జాబ్స్ కు కోచింగ్ ఇస్తున్న హైదరాబాద్ నగరంలో ఉన్న కోచింగ్ సెంటర్లకు వెళుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ ఆర్టీసీ ఒక రాయితీ ను ప్రకటించినది.
కోచింగ్ సెంటర్లకు వెళుతున్న అభ్యర్థులకు జనరల్ టికెట్ పై 20% రాయితీ (డిస్కౌంట్ ) కల్పిస్తూ క్వార్టర్ బస్ పాస్ ను ఇవ్వనున్నట్లుగా టీఎస్ఆర్టీసీ ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా అభ్యర్థులకు తెలిపింది.
సిటీ ఆర్డనరీ కు 2800 రూపాయలు మరియు మెట్రో ఎక్స్ ప్రెస్ పాస్ కు 3200 రూపాయలు ధరలను నిర్ణయం తీసుకున్నట్లుగా అభ్యర్థులకు ఆర్టీసీ సంస్థ తెలిపింది. TSRTC Good News
అయితే, ఈ రాయితీలను అభ్యర్థులు పొందాలంటే ఆధార్ కార్డు మరియు ట్రైనింగ్ ( కోచింగ్ ) సెంటర్ ఐడి లను తప్పనిసరిగా సదరు అభ్యర్థులు అందరూ కలిగి ఉండాలని ఈ ప్రకటన లో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ తెలిపినట్లుగా తెలుస్తుంది.
ప్రభుత్వ మరియు బ్యాంక్ ఉద్యోగాల సమాచరం కొరకు స్టోర్సి చూడండి. Click Here
0 Comments