Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

IRCON Jobs Recruitment 2022 : మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ,ఇర్కాన్ లో 36,000 రూపాయలు వరకూ జీతం, వెంటనే అప్లై చేసుకోండి

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఆధ్వర్యంలో ఉన్న ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ లో పలు విభాగాలలో ఖాళీగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాల  భర్తీకి సంబంధించిన ఇంపార్టెంట్  నోటిఫికేషన్ విడుదల అయినది.

ముఖ్యాంశాలు:

1). ఇవి కేంద్ర ప్రభుత్వ రైల్వే విభాగానికి చెందిన ఉద్యోగాలు.

2). భారీ స్థాయిలో జీతములు లభించనున్నాయి.

3). కాంట్రాక్ట్ బేసిస్ లో పోస్టుల భర్తీ జరుగనుంది.

ఈ కేంద్ర ప్రభుత్వ  రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన  పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.

IRCON Jobs Recruitment 2022

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

ఈ ఉద్యోగాల భర్తీకి  సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారంను మనం ఇపుడు సవివరంగా తెలుసుకుందాం. IRCON Jobs Recruitment 2022

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది                                          :   మే 9, 2022

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది   :   మే 16, 2022

విభాగాల వారీగా ఖాళీలు :

ఫైనాన్స్ అసిస్టెంట్       -      8

హెచ్. ఆర్. అసిస్టెంట్  -      5

ఐటీ ఇంచార్జ్                  -     3

మొత్తం పోస్టులు   :

16 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు  :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి సీఏ/సీఎంఏ ఇంటర్మీడియట్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఫైనాన్స్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

రెండు సంవత్సరాల ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ /డిప్లొమా ఇన్ హెచ్. ఆర్ /పర్సనల్ /ఐఆర్/పీఎం&ఐఆర్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు హెచ్. ఆర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఐటీ /కంప్యూటర్ సైన్స్ కోర్సులను పూర్తి చేసిన వారు ఐటీ ఇంచార్జ్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

వయసు  :

విభాగాలను అనుసరించి 35 సంవత్సరాలు వయసు లోపు గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

గవర్నమెంట్ గైడ్ లైన్స్  ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

మొదట ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను. తదుపరి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్స్ ఫారం ను ఈ క్రింది అడ్రస్ కు నిర్ణిత గడువు చివరి తేదిలోగా పంపవలెను.

దరఖాస్తు ఫీజు   :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను ఈ ప్రకటనలో పొందుపరచలేదు.

ఎలా ఎంపిక చేస్తారు : 

వ్రాత పరీక్ష / ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం  :

కేటగిరీలను  అనుసరించి ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 36,000  రూపాయలు  ఫిక్స్డ్ పే జీతం లభించనుంది.

భారీ స్థాయిలో లభించే ఈ జీతములతో పాటు ఏన్యువల్ ఇంక్రిమెంట్ 2000 రూపాయలు మరియు ఇతర అలోవెన్స్ +ఐడిఏ వంటి బెనిఫిట్స్ కూడా లభించనున్నాయి.

దరఖాస్తులు పంపవల్సిన చిరునామా (అడ్రస్ ) :

JGM/HRM, Ircon international Ltd,

C-4, District Centre, Saket, New Delhi - 110017.

Website

Notification

Post a Comment

0 Comments