ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విశాఖపట్నం నగరం మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ దివీస్ ల్యాబోరేటరీస్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ఈ పోస్టులకు అభ్యర్థులను ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టుల భర్తీకి నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు.
ఎంపికైన అభ్యర్థులకు వైజాగ్, హైదరాబాద్ సిటీలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. Vizag Posting Jobs 2022
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు : ఏప్రిల్ 25 నుండి మే 5,2022 వరకూ
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకూ.
నిర్వహణ ప్రదేశం :
తేదీల వారీగా ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశాల యొక్క పూర్తి వివరాలను ఈ క్రింది భాగంలో పొందుపరచబడినది. అభ్యర్థులు గమనించగలరు.
విభాగాల వారీగా ఖాళీలు :
ట్రైనీ హెల్పర్స్
ట్రైనీ సూపర్ వైజర్స్
అర్హతలు :
10వ తరగతి / ఐటీఐ ( ఫిట్టర్ /ఎలక్ట్రానిక్స్) కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ట్రైనీ హెల్పర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
బీఎస్సీ ( కెమిస్ట్రీ) / బీఫార్మసీ /బీ. టెక్ ( కెమికల్ /మెకానికల్) /ఎం.ఎస్సీ(ఆర్గానిక్ /ఎనాలిటికల్/మైక్రో బయోలజీ) కోర్సులను కంప్లీట్ చేసిన అభ్యర్థులు ట్రైనీ సూపర్ వైజర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
మరియు శారీరక దారుడ్యం, మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని ఈ ప్రకటనలో తెలిపారు.
వయసు :
19-25 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చును.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
ఎలా ఎంపిక చేస్తారు:
ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 12,500 రూపాయలు నుండి 16,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
ఈ జీతంతో పాటుగా బాచిలర్స్ కు (పురుషులకు) ఉచిత వసతి, ఉచిత యూనిఫామ్, ప్రొవిడెంట్ ఫండ్ (పీఎఫ్), ఈఎస్ఐ, వార్షిక బోనస్ మరియు భోజన ఖర్చులో రాయితీలు లాంటి ఇతర బెనిఫిట్స్ కూడా లభించనున్నాయి.
Note :
ఈ ఇంటర్వ్యూలకు హాజరు కాబోయే అభ్యర్థులు తమ తమ బయో డేటా, విద్య అర్హతల ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు జీరాక్స్ కాపీలను తమ తమ వెంట తీసుకుని రావలెను అని ప్రకటనలో తెలిపారు.
ఈ ఇంటర్వ్యూలలో కోవిడ్ రూల్స్ ను పాటిస్తామని, మాస్క్ లేని యెడల ఇంటర్వ్యూలకు అనుమతిని ఇవ్వము అని ప్రకటనలో పొందుపరిచారు.
తేదీల వారీగా ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశాలు :
ఏప్రిల్ 25, 2022 :
డాక్టర్ శామ్యూల్ జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా స్యూటీకల్స్ సైన్సెస్, మార్కాపురం, ప్రకాశం జిల్లా.
ఏప్రిల్ 25, 2022 :
పీబీ సిద్దార్ధ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్, సిద్దార్థ నగర్, విజయవాడ, ఎన్టిఆర్ జిల్లా.
ఏప్రిల్ 26, 2022 :
శ్రీ హర్షిని డిగ్రీ కాలేజ్, లాయర్ పేట్, ఒంగోలు, ప్రకాశం జిల్లా.
ఏప్రిల్ 26, 2022 :
ఎన్ఆర్ఐ కాలేజీ ఆఫ్ ఫార్మసీ, ఆగిరిపల్లి, నూజివీడు, ఏలూరు జిల్లా.
ఏప్రిల్ 27, 2022 :
చైతన్య భారతి డిగ్రీ కాలేజీ, చీరాల, బాపట్ల జిల్లా.
ఏప్రిల్ 27, 2022 :
ఏఎన్ఆర్ కాలేజీ, గుడివాడ, కృష్ణ జిల్లా.
ఏప్రిల్ 28, 2022 :
ఎన్టీఆర్ మెమోరియల్ డిగ్రీ కాలేజ్, అద్దంకి, బాపట్ల జిల్లా.
ఏప్రిల్ 28, 2022 :
ఏజీ & ఎస్జీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్, ఉయ్యురు, కృష్ణ జిల్లా.
ఏప్రిల్ 29, 2022 :
శ్రీ శ్రీనివాసా డిగ్రీ కాలేజీ, విస్సన్న పేట, ఎన్టీఆర్ జిల్లా.
ఏప్రిల్ 29, 2022 :
నర్సరావుపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా స్యుటికల్స్ సైన్సెస్, కోటాప్పకొండా రోడ్, నర్సరావుపేట, పల్నాడు జిల్లా.
ఏప్రిల్ 30, 2022 :
బాపట్ల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, బాపట్ల, బాపట్ల జిల్లా.
ఏప్రిల్ 30, 2022 :
నిమ్రా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్ జిల్లా.
మే 2, 2022 :
ఎంఆర్ఆర్ కాలేజీ ఆఫ్ ఫార్మసీ, నందిగామా, ఎన్టీఆర్ జిల్లా.
మే 2, 2022 :
ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్, తెనాలి, గుంటూరు జిల్లా.
మే 3, 2022 :
చేబ్రోలు హనుమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా స్యుటికల్ సైన్సెస్, చౌడవరం, గుంటూరు, గుంటూరు జిల్లా.
మే 4, 2022 :
సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, చేబ్రోలు, గుంటూరు జిల్లా.
మే 5, 2022 :
జెకేసీ కాలేజ్, గుజ్జనగుండ్ల, గుంటూరు.
సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :
9182774837
9346998345
ప్రభుత్వ మరియు బ్యాంక్ ఉద్యోగాల సమాచరం కొరకు స్టోర్సి చూడండి. Click Here
0 Comments