Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP Govt Jobs : ఏపీ లో గ్రూప్ 1,2 నోటిఫికేషన్ల విడుదలపై మరియు గ్రూప్-4, ఎండోమెంట్ ఆఫీసర్స్ పరీక్ష తేదీలపై క్లారిటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఏడాది లో 670 రెవిన్యూ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ గ్రూప్ - 4 పోస్టులు మరియు 60 ఎండో మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల కాబడిన సంగతి మనకు తెలిసిందే.

అయితే గడిచిన రెండు నెలల ముందే ఆయా పోస్టులకు అప్లై చేసుకునే  దరఖాస్తు గడువు ముగిసినా సరే, ఇప్పటి వరకూ సదరు పరీక్షల యొక్క తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించలేదు.

AP Govt Jobs

తాజాగా ఈ గ్రూప్ - 4 మరియు ఎండోమెంట్ ఆఫీసర్స్ పరీక్షల తేదీలపై ఏపీపీఎస్సీ హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి పరీక్షల తేదీలపై సంప్రదించగా, మే నెలలో ఏపీ లో గ్రూప్ 4 మరియు ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ - 3 పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల తేదీల షెడ్యూల్ ను విడుదల చేస్తామని  సదరు హెల్ప్ లైన్ సిబ్బంది తెలుపడం జరిగింది. AP Govt Jobs

కావున, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) మే నెలలో అనగా ఈ నెలలోనే 670 గ్రూప్ 4 మరియు 60 దేవదాయ ధర్మదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల తేదీలను ప్రకటించనున్నట్లుగా మనకు తెలుస్తుంది.

ఇక గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పోస్టుల భర్తీకి విడుదల చేసే నోటిఫికేషన్స్ పై ఈ నెలలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.పొరుగు రాష్ట్రం తెలంగాణ లో ఇప్పటికే గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల అయిన నేపథ్యంలో 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైపు అభ్యర్థులు గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 నోటిఫికేషన్స్ విడుదల కోసం  ఆశగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి గ్రూప్స్ పోస్టుల భర్తీకి విడుదల చేసే నోటిఫికేషన్స్ పై కూడా ఈ నెలలోనే అనగా మే నెలలోనే ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే వీలున్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. 

ప్రభుత్వ మరియు బ్యాంక్ ఉద్యోగాల సమాచరం కొరకు స్టోర్సి చూడండి. Click Here

Post a Comment

0 Comments