తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ శాఖతో సహా, ప్రత్యేక పోలీస్ విభాగం, అగ్నిమాపక, జైళ్లకు సంబంధించిన ఇతర శాఖలలో ఉన్న సుమారుగా 16,000 కు పైబడి ఖాళీల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఇటీవలే వరుసగా నోటిఫికేషన్స్ జారీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ పోలీస్ పోస్టుల భర్తీకి మే 2వ తేది నుండి మే 20వ తేది వరకూ టీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైటు లో దరఖాస్తు ప్రక్రియ కూడా ఆరంభం కానుంది.
మే 2వ తేది నుండి దరఖాస్తు ప్రక్రియ మొదలవ్వనున్న నేపథ్యంలో సంబంధిత వెబ్సైటు లో పోలీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకుందాం అనుకుంటున్న అభ్యర్థులకు ఇప్పుడు ఒక వార్త షాకింగ్ కు గురి చేస్తుంది. TS Police Jobs Update 2022
తాజాగా, తెలంగాణ స్టేట్ పోలీస్ శాఖలో చేపట్టనున్న నియామకాల ప్రక్రియను మరియు దరఖాస్తుల ప్రక్రియను నిర్వహిస్తున్న తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటర్నెట్ లో ఒక నకిలీ వెబ్సైటు ను సృష్టించినట్లుగా అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తుంది.
ఈ మేరకు డీజీపీ కార్యాలయంలో రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు ఇంటర్నెట్ లో ఫేక్ వెబ్సైటు ఉన్నట్లు గుర్తించారని,వెను వెంటనే ఇంటర్నెట్ నుండి సదరు నకిలీ వెబ్సైటు నూ తొలగించడానికి చర్యలు తీసుకోవాలని సదరు సైబర్ క్రైమ్ అధికారులకు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు తెలిపినట్లుగా వార్తల ద్వారా మనకు తెలుస్తుంది.
దరఖాస్తు ప్రక్రియకు ఇంకా సమయం ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తులు సృష్టించిన ఈ ఫేక్ వెబ్సైటు ను తొలగించడానికి తీసుకోవలసిన చర్యలను వాయు వేగంగా ఆరంభించినట్లుగా, ప్రస్తుతం నకిలీ వెబ్సైటు ను తొలగించే పనిలో పోలీస్ ఉన్నతాధికారులు నిమగ్నం అయినట్లుగా తెలుస్తుంది.
మే 2వ తేది నుండి ఆరంభం అయ్యే ఈ పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియలో భాగంగా, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నకిలీ వెబ్సైటు ను తెరిచి పరీక్షకు దరఖాస్తు ఫీజును చెల్లించిన యెడల, అభ్యర్థులు విలువైన డబ్బులను నష్టపోయే ప్రమాదం పొంచి ఉన్నందువల్ల సైబర్ క్రైమ్ అధికారులు ఈ ఫేక్ వెబ్సైటు ను తొలగించడానికి చర్యలు ప్రారంభించినట్లుగా మనకు విశ్వసనీయ సమాచారం మేరకు వార్తలు వస్తున్నాయి.
ఇలానే తెలంగాణ రాష్ట్రంలో జాతీయ హెల్త్ మిషన్ సంబంధిత ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తప్పుడు నియామక ప్రకటనలు వచ్చినట్లుగా గుర్తించిన వైద్య ఆరోగ్య శాఖాధికారులు, జాతీయ హెల్త్ మిషన్ ఎలాంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ ఇవ్వలేదని, అభ్యర్థులు ఫేక్ ప్రకటనల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఈ విషయంను కూడా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ దృష్టికి తీసుకుని వెళ్లినట్లుగా తెలుస్తుంది.
0 Comments