Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

APVVP Vizag Jobs 2022 : ఏపీ వైద్య విధాన పరిషత్, వైజాగ్ లో ఉద్యోగాలు, జీతం 28,000 రూపాయలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమునకు చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ), విశాఖపట్నం నగరంలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్య అంశాలు :

1). ఇవి ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.

2). భారీ స్థాయిలో వేతనాలు లభించును.

3). కాంట్రాక్టు / అవుట్ సోర్సింగ్ విధానంలో పోస్టుల భర్తీ.

APVVP Vizag Jobs 2022

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వైజాగ్ నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

ఏపీవీవీపీ నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. APVVP Vizag Jobs 2022

ముఖ్యమైన తేదీలు  :

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది  : మే 20, 2022.

విభాగాల వారీగా ఖాళీలు :

ఆడియో మెట్రిషియన్           -      2

పోస్ట్ మార్టం అసిస్టెంట్          -      1

జనరల్ డ్యూటీ అటెండెంట్   -      1

ల్యాబ్ టెక్నీషియన్                -      3

మొత్తం పోస్టులు  :

7 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్, సంబంధిత సబ్జెక్టు విభాగాలలో డిప్లొమా మరియు బీఎస్సీ కోర్సులను కంప్లీట్ చేయవలెను అని ఈ ప్రకటనలో తెలిపారు.

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండవలెను.

వయసు :

18-42 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) ఉండే అవకాశం కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకుని, పూర్తి చేసి తదుపరి పూర్తి చేసిన దరఖాస్తు ఫారంనకు సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలను జతపరచి, నిర్ణిత గడువు చివరి తేది లోగా సంబంధిత అడ్రస్ కు చేరవేయవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.

ఎలా ఎంపిక చేస్తారు:

విద్యా అర్హతలలో సాధించిన మార్కులు, మెరిట్, అనుభవం మరియు రిజర్వేషన్స్ అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం  :

కేటగిరీలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 15,000 నుండి 28,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ ( చిరునామా )  :

జిల్లా కో - ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (ఏపీవీవీపీ),

విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.

Website

Notification

10 వ తరగతి అర్హతతో ఏపి లో పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టరేట్ లో ఉద్యోగాలు Click Here

TSTET Model Quiz 

Post a Comment

0 Comments