ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకుల కార్యాలయం, విజయవాడ నుండి ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు:
1). ఇవి ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.
2). భారీ స్థాయిలో వేతనాలు.
3). ఈ ఉద్యోగాలను రెగ్యులర్ బేసిస్ లో భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు, డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, విజయవాడ ఆధ్వర్యంలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ఈ పోస్టుల భర్తీ విధి విధానాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. Vijayawada and Kakinada Jobs
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : మే 19, 2022 (5:30 PM)
విభాగాల వారీగా ఖాళీలు :
సివిల్ అసిస్టెంట్ సర్జన్ - 31 ( ఓపెన్ కేటగిరీ )
మొత్తం పోస్టులు :
31 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి ఎంబీబీఎస్ కోర్సులను పూర్తి చేసి మరియు మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ అయిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు.
వయసు :
42 సంవత్సరాలు వయసు లోపు అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ /బీసీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యంగులకు 10 సంవత్సరాలు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ లకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను ఈ ప్రకటనలో పొందుపరచలేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
టెస్ట్ / ఇంటర్వ్యూ విధానాలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు భారీ స్థాయిలో జీతములు మరియు ఇతర గవర్నమెంట్ అలోవెన్స్ లు లభించనున్నాయి. సుమారుగా సంవత్సరానికి 7 లక్షల రూపాయలు పైన జీతం అందే అవకాశం కలదు.
-----------------------------------------------------------------------------------------------------------------------------
కాకినాడ లో జాబ్ మేళా, మరిన్ని వివరాలను ఇప్పుడే తెలుసుకోండి, ఇంటర్వ్యూలకు హాజరు కండి, డోంట్ మిస్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా అభ్యర్థులకు తెలియజేశారు.
ఈ జాబ్ మేళా కు సంబంధించిన ప్రకటనలో తెలిపిన ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
జాబ్ మేళా నిర్వహణ తేదీ : మే 16, 2022.
జాబ్ మేళా నిర్వహణ వేదిక : ఉదయం 9 గంటలకు
జాబ్ మేళా నిర్వహణ ప్రదేశం :
కాకినాడ జిల్లా కలెక్టరేట్, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్.
జాబ్ మేళా లో పాల్గొనే సంస్థలు :
కీర్తన ఫైనాన్సియల్ లిమిటెడ్
కోజెంట్
ఈ సర్వీసెస్
నిట్
డెక్కన్ కెమికల్స్
మరియు ఇతర ప్రయివేట్ కంపెనీలు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి 10వ తరగతి నుండి డిగ్రీ విద్యా అర్హతలుగా కలిగిన అభ్యర్థులు అందరూ ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చును అని ఈ ప్రకటన ద్వారా తెలుస్తుంది.
జీతం :
ఈ జాబ్ మేళా లో వివిధ కంపెనీలలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనాలు లభించనున్నాయి.
కావలసిన డాక్యుమెంట్స్ :
విద్యా అర్హతల మార్కుల సర్టిఫికెట్స్ జీరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు తదితర డాక్యుమెంట్స్ తో ఈ జాబ్ మేళా కు హాజరు కావలెను అని ఈ ప్రకటనలో తెలిపారు.
Note :
కాకినాడ జిల్లాలో నిర్వహించే ఈ జాబ్ మేళా గురించిన మరింత ముఖ్యమైన సమాచారం కోసం అభ్యర్థులు ఈ క్రింది మొబైల్ ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చునని ప్రకటనలో తెలిపారు.
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ :
8297400666
---------------------------------------------------------------------------------------------------------------------------
మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ లో ఉద్యోగాలు, కాకినాడ లో పోస్టింగ్స్, జీతం 25,100 రూపాయలు వరకూ, ఇప్పుడే అప్లై చేసుకోండి.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ ఆక్వాకల్చర్ (NaCSA), హెడ్ క్వార్టర్ కాకినాడ నుండి ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా ప్రకటించబడినది.
ముఖ్య అంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
3). భారీ స్థాయిలో వేతనాలు.
4). కాంట్రాక్టు బేసిస్ లో భర్తీ చేసే ఈ పోస్టులను, పెర్ఫార్మన్స్ ను బట్టి రెన్యూయల్ చేయనున్నారు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఇరు తెలుగు రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కలదని ప్రకటన ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కాకినాడ నగరంలో మరియు ఒడిశా, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ మరియు కర్ణాటక రాష్ట్రంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ఎన్ఏసీఎస్ఏ నుండి వచ్చిన ఈ ప్రకటన గురించిన ఇంపార్టెంట్ విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ దరఖాస్తులు చేరుటకు చివరి తేది : మే 21, 2022.
విభాగాల వారీగా ఖాళీలు :
ఫీల్డ్ మేనేజర్ - 10
ఆఫీస్ అసిస్టెంట్ - 01
మొత్తం పోస్టులు :
11 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి బీఎఫ్ఎస్సీ లేదా బీఎస్సీ ఇన్ బయోలాజికల్ సైన్సెస్ /ఆక్వాకల్చర్ /జూవలజీ/ఫిషరీస్ విభాగాలలో కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఫీల్డ్ మేనేజర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
బాచిలర్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేసిన వారు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఇంగ్లీష్ మరియు రీజనల్ లాంగ్వేజ్ పై నాలెడ్జ్ కలిగి ఉండవలెను.
కంప్యూటర్ నాలెడ్జ్ -ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్, డీటీపీ, పేజీ మేకర్, ఫోటో షాప్ మరియు టైపింగ్ స్కిల్స్ (40 wpm) అవసరం.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
33 సంవత్సరాలు వయసు లోపు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు మరియు ఎస్సీ/ఎస్టీ/పీసీ కేటగిరీల వారికి 5 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
అభ్యర్థులు మొదట ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను. తదుపరి దరఖాస్తు చేసుకున్న ఆన్లైన్ అప్లికేషన్ ఫారం నకు సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలను జతపరచి, హార్డ్ కాపీలను నిర్ణిత గడువు చివరి తేది లోగా ఈ క్రింది అడ్రస్ కు పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 250 రూపాయలును డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) రూపంలో దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను. ఎస్సీ /ఎస్టీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
షార్ట్ లిస్ట్, వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానాలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 16,500 నుండి 25,100 రూపాయలు వరకూ జీతం అందనుంది.
దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ ( చిరునామా ) :
To,
The Chief Executive Officer,
National Centre for Sustainable Aquaculture(NaCSA),
(MPEDA, Ministry Of Commerce & Industry, Govt. Of India)
Door No. 70-1A-6/1, Vasireddy vari street, Beside Muncipal Corporation High School,
Ramanayyapeta,
Kakinada - 533005,
Kakinada Dt,
Andhra Pradesh, India.
Email Address :
nacsa@mpeda.gov.in
ఏపీ లో గ్రూప్ 1,2 నోటిఫికేషన్ల విడుదలపై మరియు గ్రూప్-4, ఎండోమెంట్ ఆఫీసర్స్ పరీక్ష తేదీలపై క్లారిటీ Click Here
0 Comments