గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ ఆధ్వర్యంలో ఉన్న మినీరత్న కంపెనీ అయిన బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవడానికి అర్హులే.
3).భారీ స్థాయిలో వేతనాలు.
4). కాంట్రాక్టు బేసిస్ లో భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు కాబట్టి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది.
బీఈసీఐఎల్ నుండి వచ్చిన ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : మే 22, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
డేటా ఎంట్రీ ఆపరేటర్స్ - 86
మొత్తం పోస్టులు :
86 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి గ్రాడ్యుయేట్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఒక నిమిషంలో 35 ఇంగ్లీష్ పదములు(35 wpm ఇన్ ఇంగ్లీష్ ) లేదా ఒక నిమిషంలో 30 హిందీ పదములు(30 wpm ఇన్ హిందీ) టైపింగ్ చేయడంలో నాలెడ్జ్ ను కలిగి ఉండవలెను.
ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్ మరియు ఎక్సెల్ వంటి కంప్యూటర్ సంబంధిత విభాగాలలో నాలెడ్జ్ ను కలిగి ఉండవలెను అని ఈ ప్రకటనలో తెలిపారు.
వయసు :
ఎటువంటి వయసు పరిమితి నిబంధనలను ఈ ప్రకటనలో పొందుపరిచలేదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఈ పోస్టులకు అప్లై చేసుకునే జనరల్ /ఓబీసీ కేటగిరీ/మహిళలు /ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ అభ్యర్థులు 750 రూపాయలను మరియు ఎస్సీ /ఎస్టీ /ews/పీహెచ్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 450 రూపాయలను దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు:
టైపింగ్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ / వ్రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ & డిస్క్రిప్టివ్) ల ఆధారముగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
పరీక్ష - సిలబస్ :
జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ గ్రామర్ తదితర సబ్జెక్టులపై ప్రశ్నలను ఈ పరీక్షలో అడుగనున్నారు.
జీతం :
ఢిల్లీ గవర్నమెంట్ వేజెస్ రేట్స్ ప్రకారం ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 21,184 రూపాయలు వరకూ జీతములు లభించనున్నాయి.
0 Comments