Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

IPPB Jobs : ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లో ఉద్యోగాలు, జీతం 30,000 రూపాయలు

గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్యాంశాలు:

1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.

2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు దరఖాస్తుకు అర్హులే.

3). భారీ స్థాయిలో వేతనాలు.

4). ఇతర అలోవెన్స్ లు కూడా లభించనున్నాయి.

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

IPPB Jobs

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఐపీపీబీ నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన ముఖ్యమైన అంశాలు అన్నిటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. IPPB Jobs

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి  తేది  :  మే 20, 2022

అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ తేది   : పరీక్షలకు 7-10 రోజుల ముందు.

ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహణ తేది      :   జూన్, 2022

పరీక్షల ఫలితాల విడుదల తేది    :  జూన్, 2022

విభాగాల వారీగా ఖాళీలు   :

ఎగ్జిక్యూటివ్     -    650

తెలుగు రాష్ట్రాలకు కేటాయించబడిన పోస్టులు  :

ఆంధ్రప్రదేశ్     -   34

తెలంగాణ          -   21

మొత్తం పోస్టులు  :

650 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు  :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ కోర్సులను పూర్తి చేసి, జీడీఎస్ గా రెండు సంవత్సరాలు అనుభవం కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు  :

20-35 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చును.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) ఉండే అవకాశం కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు   :

700 రూపాయలు దరఖాస్తు ఫీజుగా అభ్యర్థులు చెల్లించవలెను.

ఎలా ఎంపిక చేస్తారు:

ఆన్లైన్ పరీక్ష, మెరిట్ లిస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ పోస్టులకి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

సిలబస్ - వివరాలు  :

మొత్తం 120 మార్కులకు పరీక్ష నిర్వహణ ఉంటుంది.120 ప్రశ్నలను అడుగనున్నారు.

ఐపీపీబీ ప్రోడక్ట్స్ పై అవగాహనా, బేసిక్ బ్యాంకింగ్ /పేమెంట్స్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ అవేర్నెస్, డిజిటల్ పేమెంట్స్ / బ్యాంకింగ్ అండ్ టెలికామ్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ, రీసనింగ్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంశాలపై ప్రశ్నలను అడుగనున్నారు.

పరీక్ష కేంద్రాలు - ఎంపిక :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూల్, నెల్లూరు మరియు రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, వైజాగ్, విజయనగరం జిల్లాలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసుకోవచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం మరియు వరంగల్ జిల్లాలను ఎగ్జామినేషన్ సెంటర్స్ గా అభ్యర్థులు ఎంపిక చేసుకోవచ్చు.

Website

Notification

Post a Comment

0 Comments