గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో ఉన్న ఇండో - టీబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు:
1). ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కు చెందిన పోస్టులు.
2). గ్రూప్ - సీ నాన్ - గేజిటెడ్ విభాగంలో భర్తీ.
3). భారీ స్థాయిలో వేతనాలు.
4). ఈ పోస్టులను పేర్మినెంట్ గా చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఐటీబీపీఎఫ్ నుండి వచ్చిన ఈ ఉద్యోగ ప్రకటనలో పొందుపరిచిన ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : జూన్ 8, 2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : జూలై 7, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
ఏఎస్ఐ ( స్టేనో గ్రాఫర్ ) డైరెక్ట్ ఎంట్రీ, మేల్ - 19
ఏఎస్ఐ ( స్టేనో గ్రాఫర్ ) డైరెక్ట్ ఎంట్రీ, ఫీమేల్ - 2
ఏఎస్ఐ (స్టేనోగ్రాఫర్ ) (ఎల్డీసీఈ ) - 17
కానిస్టేబుల్ ఉద్యోగాలు :
హెడ్ కానిస్టేబుల్ పురుషుడు -135
కానిస్టేబులు మహిళ -23
మొత్తం పోస్టులు :
196 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి ఇంటర్మీడియట్ లేదా సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ (10+2) కలిగి ఉండవలెను.
టైపింగ్ స్పీడ్ ఇంగ్లీష్ లో 35 మరియు హిందిలో టైపింగ్ స్పీడ్ 30 వర్డ్స్ ఫర్ WMP ఉండాలి.
పై అర్హతలతో పాటు ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో కంప్యూటర్ ట్రాన్స్ స్క్రిప్షన్ నైపుణ్యలు కలిగి ఉండవలెను అని ఈ ప్రకటనలో తెలిపారు.
శారీరక ప్రమాణాలు : మగ వారికి హైట్ 165, chest 81cm ( శ్వాస పీల్చినప్పుడు 5 Cm Expansion అవ్వలి)
స్త్రీలకు వయస్సు హైట్ 157 CM ఇవ్వడం జరిగింది.
కేటగిరీలను అనుసరించి 18 నుండి 35 సంవత్సరాలు వయసు లోపు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఏజ్ రిలాక్స్యేషన్ ఉండే అవకాశాలు కలవు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
100 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్, ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవల్సిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
ఫీజికల్ ఏఫిసియన్సీ టెస్ట్, ఫీజికల్ స్టాండర్డ్ టెస్ట్, వ్రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యూమెంటేషన్ అండ్ డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ /రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 29,200 నుండి 92,300 రూపాయలు వరకూ జీతం అందనుంది.
0 Comments