వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు, జీతం 18,500 రూపాయలు వరకూ, వెను వెంటనే అప్లై చేసుకోండి ఇలా, ఇది మంచి అవకాశం, అస్సలు వదులుకోవద్దు.
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఉన్న డాక్టర్ వై. ఎస్. ఆర్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, వై. ఎస్. ఆర్ జిల్లాలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీనకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.
2). ఆకర్షణీయమైన వేతనాలు లభించనున్నాయి.
3). లోకల్ లో పోస్టింగ్స్.
4). అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు కడప జిల్లా వ్యాప్తంగా పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
వైఎస్ఆర్ జిల్లా నుండి వచ్చిన ఈ తాజా ప్రకటనలో తెలిపిన అంశాలను అన్నిటిని మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : మే 31, 2022.
విభాగాల వారీగా ఖాళీలు :
ఆరోగ్య మిత్ర - 7
టీమ్ లీడర్ - 3
డేటా ఎంట్రీ ఆపరేటర్ - 3
మొత్తం పోస్టులు :
13 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి బీ. ఎస్సీ /ఎం. ఎస్సీ ( నర్సింగ్ ), బీ. ఫార్మసీ, ఫార్మసీ. డీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సులను పూర్తి చేసి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, తెలుగు, ఇంగ్లీష్ భాషలను మాట్లాడడం, చదవడం మరియు వ్రాయడం వచ్చి ఉండి, కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్ పై నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులు అందరూ ఆరోగ్య మిత్ర పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి బీ. ఎస్సీ /ఎం. ఎస్సీ ( నర్సింగ్ ), బీ. ఫార్మసీ, ఫార్మసీ. డీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సులను పూర్తి చేసి, హాస్పిటల్ సర్వీసెస్ లో కనీసం రెండేళ్ల అనుభవం, లీడర్ షిప్ మరియు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగిన అభ్యర్థులు అందరూ టీమ్ లీడర్స్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.
బాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్ మరియు ఒక సంవత్సరం పీజీడీసీఏ కోర్సులను కంప్లీట్ చేసిన వారు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
42 సంవత్సరాలు వయసు కలిగిన ఓసీ కేటగిరీ అభ్యర్థులు, 47 సంవత్సరాలు వరకూ వయసు కలిగిన ఎస్సీ /ఎస్టీ /బీసీ కేటగిరీ అభ్యర్థులు మరియు 50 సంవత్సరాల వయసు కలిగిన ఎక్స్ సర్వీస్ మెన్ & దివ్యాంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆఫ్ లైన్ విధానంలో అభ్యర్థులు నింపిన దరఖాస్తు ఫారం నకు సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలను జతపరచి నిర్ణిత గడువు చివరి తేది లోగా ఈ క్రింది అడ్రస్ కు రిజిస్టర్ పోస్ట్ ద్వారా గానీ డైరక్ట్ గా కానీ, ఈ క్రింది చిరునామా కు పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
300 రూపాయలును అభ్యర్థులు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు:
అకాడమిక్ క్వాలిఫీకేషన్, కంప్యూటర్ స్కిల్స్, ఇంటర్వ్యూ విధానాలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 15,000 నుండి 18,500 రూపాయలు వరకూ జీతం లభించనుంది.
దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ :
DM & HO,
Kadapa.
కర్నూల్ లో ఖాళీగా ఉన్న ఆరోగ్య మిత్ర ఉద్యోగాల భర్తీ :
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్టుమెంటు ఆధ్వర్యంలో ఉన్న డాక్టర్ వై. ఎస్. ఆర్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్, కర్నూల్ లో ఖాళీగా ఉన్న ఆరోగ్య మిత్ర ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.
2). గౌరవ స్థాయిలో వేతనాలు.
3). అవుట్ సోర్సింగ్ విభాగంలో పోస్టుల భర్తీ.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరు దరఖాస్తు చేసుకోవలెను.
ఈ పోస్టులకి ఎంపికైన అభ్యర్థులకు కర్నూల్ జిల్లాలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ఈ ఆరోగ్య మిత్ర ఉద్యోగాల భర్తీ విధి - విధానాలను గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ దరఖాస్తులు చేరడానికి చివరి తేది : జూన్ 1, 2022 ( 5 PM ).
విభాగాల వారీగా ఖాళీలు :
ఆరోగ్య మిత్ర - 11
మొత్తం పోస్టులు :
11 పోస్టులను తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీ. ఫార్మసీ, ఫార్మసీ. డీ, బీ. ఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సులను కంప్లీట్ చేసిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
కమ్యూనికేషనల్ స్కిల్స్, తెలుగు మరియు ఇంగ్లీష్ వ్రాయడం, చదవడం వచ్చి ఉండాలని, ఎంఎస్ ఆఫీస్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండి, మెడికల్ విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
42 సంవత్సరాలు వయసు వరకూ గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ / బీసీ కేటగిరీ అభ్యర్థులు 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ / మహిళా అభ్యర్థులు 3 సంవత్సరాలు వరకూ వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా ఎంపిక చేసుకోవాలి:
నింపిన దరఖాస్తు ఫారంలకు సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలను జతపరచి నిర్ణిత గడువు చివరి తేదీలోగా ఈ క్రింది అడ్రస్ కు పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
300 రూపాయలును దరఖాస్తు ఫీజులుగా అభ్యర్థులు చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు:
విద్యా అర్హతల మార్కులు, కంప్యూటర్ స్కిల్స్, అనుభవం, ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులకి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 15,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ ( చిరునామా ) :
The District Co-ordinator,
YSR Aarogyasri Health Care Trust,
Kurnool.
0 Comments