భారత దేశ వ్యాప్తంగా గడిచిన నెల ఏప్రిల్ 11, 2022 నుండి ఏప్రిల్ 21, 2022 వరకూ జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్, 2021 టైర్ -1 పరీక్షల యొక్క తాత్కాలిక జవాబు కీ లను తమ అధికారిక వెబ్సైటు లో పొందుపరిచినట్లుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా తాజాగా తెలిపింది.
ఇరు తెలుగు రాష్ట్రాలలో ఈ టైర్ - 1 పరీక్షలు వ్రాసిన అభ్యర్థులు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి, ఓపెన్ కాగానే తమ తమ రిజిస్ట్రేషన్ లాగిన్ ఐడీ మరియు పాస్ వర్డ్ లతో ఈ పరీక్షల ఆన్సర్ కీ లను చూసుకోవచ్చు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా విడుదల చేసిన ఈ కీ లపై అభ్యర్థులు ఏమైనా సందేహాలు ఉంటే మే 2, 2022 నుండి మే 7, 2022 సాయంత్రం 5 గంటల వరకూ 100 రూపాయలును చెల్లించి రిప్రెసెంటేషన్ లను కూడా ఇవ్వవచ్చు అని ఈ ప్రకటన ద్వారా ఎస్ఎస్సీ అభ్యర్థులకు తెలిపింది.
అంతే కాకుండా అభ్యర్థులు పరీక్షలు వ్రాసిన తమ తమ రెస్పాన్స్ షీట్స్ ను కూడా ప్రింట్ అవుట్ లను తీసుకోవచ్చు అని కూడా ఈ ప్రకటన ద్వారా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తెలిపింది.
వెబ్‌స్టోరీస్ చూడండి.
0 Comments