గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్టుమెంటు ఆఫ్ ఆటోమిక్ ఎనర్జీ ఎంటర్ ప్రైస్ ఆధ్వర్యంలో ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL), హైదరాబాద్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు:
1).ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.
3). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని తెలుస్తుంది.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ఈసీఐఎల్ నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. ECIL Vacancies 2022 Telugu
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : మే 14, 2022
హార్డ్ కాపీ లు చేరుటకు చివరి తేది : మే 21, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ - టెక్నికల్ - 11
సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ - హెచ్. ఆర్ - 1
డిప్యూటీ జనరల్ మేనేజర్ - ఫైనాన్స్ - 1
డిప్యూటీ జనరల్ మేనేజర్ - కార్పొరేట్ పర్చేస్ - 1
డిప్యూటీ జనరల్ మేనేజర్ -కార్పొరేట్ కమ్యూనికేషన్స్ -1
డిప్యూటీ జనరల్ మేనేజర్ - హెచ్. ఆర్ - 1
సీనియర్ జనరల్ మేనేజర్ - ఫైనాన్స్ - 2
పర్సనల్ ఆఫీసర్ - 1
అకౌంట్స్ ఆఫీసర్ - 1
మొత్తం పోస్టులు :
20 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి ఎలక్ట్రికల్ /ఎలక్ట్రానిక్స్ / టెలి కమ్యూనికేషన్స్ / కంప్యూటర్ ఇంజనీరింగ్ /మెకానికల్ విభాగాలలో 60% మార్కులతో ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ / ఎంబీఏ / పీజీ డిప్లొమా / హెచ్ ఆర్ /ఐఆర్/పీఎం/ సోషల్ వర్క్ విభాగాలలో రెండు సంవత్సరాల డిప్లొమా / సీఏ/icwa/ పబ్లిక్ రిలేషన్స్ /జర్నలిజం /మాస్ కమ్యూనికేషన్ లో ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ / తదితర కోర్సులను పూర్తి చేయవలెను.
సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.
వయసు :
28 నుండి 53 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో మొదట అప్లై చేసుకుని, తదుపరి హార్డ్ కాపీలను సంబంధిత అడ్రస్ కు నిర్ణిత గడువు చివరి తేదిలోగా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
500 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు..?
ఇంటర్వ్యూ విధానం ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ఇంటర్వ్యూ తేదీలను అభ్యర్థులకు వ్యక్తిగత సంక్షిప్త సందేశాల ద్వారా తెలియజేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకి ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 40,000 రూపాయలు నుండి 2,40,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
హార్డ్ కాపీ లను పంపవల్సిన అడ్రస్ :
Deputy General Manager (HR),
Human Resources (Recruitment Section ),
Admiministrative Building, Corporate Office,
Electronics Corporation of India Limited,
ECIL (Post), Hyderabad - 500062, Telangana.
0 Comments