ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి నగరంలో ఉన్న ఐఐటీ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకు సంబంధించిన ఒక ప్రకటన తాజాగా విడుదల అయింది.
ముఖ్యాంశాలు:
1). భారీ స్థాయిలో వేతనాలు.
2). అవుట్ సోర్సింగ్ విధానంలో పోస్టుల భర్తీ.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. Tirupati IIT Jobs
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు తిరుపతి, ఐఐటీ లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
తిరుపతి నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన ముఖ్యమైన వివరాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : మే 31, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
ప్రాజెక్ట్ ఆఫీసర్ ( సివిల్ ) | 2 |
ప్రాజెక్ట్ అసోసియేట్ ( సివిల్ ) | 1 |
ప్రాజెక్ట్ అసోసియేట్ ( హెచ్వీఏసీ / సర్వీసెస్ ) | 1 |
ప్రాజెక్ట్ అసిస్టెంట్ | 1 |
మొత్తం పోస్టులు :
5 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి సివిల్ ఇంజనీరింగ్ / మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాలలో బీఈ / బీటెక్ / ఏదైనా విభాగాలలో డిగ్రీ కోర్సులను పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం, కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.
వయసు :
35 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
కమిటీ డేసిషన్ ప్రకారం ఏజ్ రిలాక్స్యేషన్ ను ఇచ్చే అవకాశం కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ క్రింది లింక్ ద్వారా పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు
ఎలా ఎంపిక చేస్తారు:
షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ విధానాలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 16,000 రూపాయలు నుండి 35,500 రూపాయలు వరకూ జీతం అందనుంది.
0 Comments