తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) ఆధ్వర్యంలో ఉన్న ఎస్వీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్స్ ( ఆయుర్వేద) ఉద్యోగాల భర్తీకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లుగా టీటీడీ తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలియజేసినది.
ముఖ్య అంశాలు :
1). ఇవి టీటీడీ సంస్థకు చెందిన పోస్టులు.
2). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకి ఎస్వీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ టీటీడీ లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
తిరుపతి దేవస్థానం నుండి వచ్చిన ఈ ప్రకటనలో తెలిపిన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : జూన్ 7, 2022.
పోస్టులు - ఖాళీలు :
మెడికల్ ఆఫీసర్స్ (ఆయుర్వేద ) ఎస్వీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ - 8.
విభాగాల వారీగా ఖాళీలు :
ఓసీ ( మహిళ)
ఎస్సీ ( మహిళ)
బీసీ - ఏ ( మహిళ)
వీహెచ్ ( మహిళ)
ఎస్సీ
ఎస్టీ ( మహిళ)
బీసీ - బీ ( మహిళ)
ఓసీ ( మహిళ)
మొత్తం పోస్టులు :
8 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి డిగ్రీ ఇన్ ఆయుర్వేద కోర్సులను పూర్తి చేసి, సంబంధిత విభాగాలలో అనుభవం ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు.
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు హిందూ మతమునకు చెందిన వారు అయ్యి ఉండాలనే నిబంధనను ఈ ప్రకటనలో పొందుపరిచారు. Tirupati TTD Jobs
వయసు :
41 సంవత్సరాలు వరకూ ఉన్న ఓసీ కేటగిరీ అభ్యర్థులు మరియు 45 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న ఎస్సీ /ఎస్టీ /బీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి:
సంబంధిత వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఫారం ను పూర్తి చేసి, తదుపరి ఆ అప్లికేషన్ ఫారంనకు అభ్యర్థులు వారి బయో డేటా, ఏజ్ ప్ర్రూఫ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫీకేషన్స్ సర్టిఫికెట్స్, టెక్నికల్ క్వాలిఫీకేషన్స్, మార్క్స్ స్టేట్ మెంట్స్, ఎక్స్పీరియన్స్, కాస్ట్ సర్టిఫికెట్స్, గేజిటెడ్ ఆఫీసర్ చేత ఆటేస్టేడ్ చేయించిన ఫోటో కాపీస్ తో పాటు మూడు రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలను నిర్ణిత దరఖాస్తు గడువు చివరి తేదిలోగా ఈ క్రింది చిరునామాకు పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
ఇంటర్వ్యూ / వ్రాత పరీక్షల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 57,100 నుండి 1,47,760 రూపాయలు వరకూ జీతం అందనుంది.
దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ :
To The Executive Officer,
T. T. D., K. T. Road,
Tirupati.
0 Comments