Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

IOCL Jobs Recruitment 2022 : ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు, జీతం 1,05,000 రూపాయలు

మహరత్న కంపెనీ అయినా  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) కు చెందిన బొంగయ్గాన్  రీఫైనరీస్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్యాంశాలు : 

1).ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.

2).భారీ స్థాయిలో వేతనాలు.

ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

IOCL Jobs Recruitment 2022

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్టులకు అర్హులే అని ప్రకటన లో తెలిపారు.

IOCL ద్వారా జారీ అయిన ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన వివరాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం. IOCL Jobs Recruitment 2022

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ అప్లికేషన్స్ కు  ప్రారంభం తేది     :   ఏప్రిల్ 21, 2022

ఆన్లైన్ అప్లికేషన్స్ కు  చివరి తేది          :    మే 12, 2022

వ్రాత పరీక్ష నిర్వహణ తేదీలు               :    మే 22, 2022

వ్రాత పరీక్ష ఫలితాలు విడుదల తేది     :    జూన్ 2, 2022

విభాగాల వారీగా ఖాళీలు    :

జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ -IV ( మెకానికల్ )                -   1

జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ -IV ( ఇన్స్ట్రుమెంటేషన్ )    -   1

జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఎనాలిస్ట్ -IV                           -  4

మొత్తం ఉద్యోగాలు  :

తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హతలు  :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి  మూడు సంవత్సరాల డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్  లేదా మెట్రిక్ విత్ ఐటీఐ ఫిట్టర్ కోర్సులను పూర్తి చేసిన వారు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ -IV ( మెకానికల్) పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మూడు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ /ఇన్స్ట్రుమెంటేషన్ & ఎలక్ట్రానిక్స్ /ఇన్స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఇంజనీరింగ్ కోర్స్ లను పూర్తి చేసిన అభ్యర్థులు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ -IV ( ఇన్స్ట్రుమెంటేషన్) పోస్టుకు అప్లై చేసుకోవచ్చును.

బీ. ఎస్సీ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ /ఇండస్ట్రీయల్ కెమిస్ట్రీ & మాథ మెటిక్స్ కోర్సులను కంప్లీట్ చేసినవారు జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఎనాలిస్ట్ -IV పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

వయసు  :

18 నుండి 26 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి (ఏజ్ రిలాక్స్యేషన్ ) సడలింపు కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి: 

ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు   :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు..?

వ్రాత పరీక్ష  మరియు స్కిల్ / ప్రోఫీషియాన్సీ /ఫీజికల్ టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 25,000 నుండి 1,05,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

Apply Link and Website Link 

Notification 

Post a Comment

0 Comments