Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Gramina Bank Jobs 2022 : గ్రామీణ బ్యాంకుల్లో 8106 ఉద్యోగాలు, 20,000 వరకు జీతం

భారతదేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రూరల్  గ్రామీణ బ్యాంక్ లలో ఖాళీగా ఉన్న ఆఫీసర్స్, ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ ను తాజాగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) విడుదల చేసినది.

ముఖ్యాంశాలు:

1). ఇవి బ్యాంక్ కు సంబంధించిన ఉద్యోగాలు.

2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

3).భారీ సంఖ్యలో పోస్టుల భర్తీ.

4). భారీ స్థాయిలో వేతనాలు.

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు అర్హతలు కలిగిన ఇండియన్స్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఐబీపీఎస్ నుండి వచ్చిన ఈ ప్రకటన గురించి మరింత సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు ప్రారంభం తేది   :  జూన్ 7, 2022

ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు  చివరి తేది       :  జూన్ 27, 2022

ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్స్ డౌన్లోడ్ తేది : జూలై 9, 2022

ప్రీ - ఎగ్జామ్ ట్రైనింగ్ కండక్ట్ తేది         : జూలై 18-జూలై 23.

ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కాల్ లెటర్స్ డౌన్లోడ్ తేది : జూలై/ఆగష్టు.

ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ నిర్వహణ తేది   :  ఆగష్టు, 2022.

ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ తేది       :  సెప్టెంబర్, 2022.

మెయిన్స్ పరీక్ష నిర్వహణ తేది             :  సెప్టెంబర్ /అక్టోబర్

రిజల్ట్ నిర్వహణ తేది                           :  అక్టోబర్, 2022

ఇంటర్వ్యూ నిర్వహణ తేది                  : అక్టోబర్ /నవంబర్

ప్రొవిజనల్ ఆలోట్మెంట్ తేది                  : జనవరి, 2023.

విభాగాల వారీగా ఖాళీలు   :

పోస్ట్ లు ఖాళీలు
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్ ) 4483
ఆఫీసర్ స్కేల్ - I 2676
ఆఫీస్ స్కేల్ - II (అగ్రికల్చర్ ఆఫీసర్ ) 12
ఆఫీసర్ స్కేల్ -II (మార్కెటింగ్ ఆఫీసర్) 6
ఆఫీసర్ స్కేల్ -II (ట్రెజరీ మేనేజర్ ) 10
ఆఫీసర్ స్కేల్ -II (లా ) 18
ఆఫీసర్ స్కేల్ -II (సీఏ) 10
ఆఫీసర్ స్కేల్ -II (ఐటీ) 57
ఆఫీసర్ స్కేల్ - II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్) 745
ఆఫీసర్ స్కేల్ - II 80

తెలుగు రాష్ట్రాల్లో కేటాయించబడిన పోస్టులు  :

ఆఫీస్ అసిస్టెంట్స్ :

ఆంధ్రప్రదేశ్ (ఏపీ ) :

ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంక్      -    21

సప్తగిరి గ్రామీణ బ్యాంక్                            -    83

తెలంగాణ :

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్      -   118

తెలంగాణ గ్రామీణ బ్యాంక్                     -     70

ఆఫీసర్ స్కేల్ - I  :

ఆంధ్రప్రదేశ్ (ఏపీ ) :

ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణా బ్యాంక్      -    64

సప్తగిరి గ్రామీణా బ్యాంక్                           -    32

తెలంగాణ  :

ఆంధ్రప్రదేశ్ గ్రామీణా వికాస్ బ్యాంక్      -   65

తెలంగాణ గ్రామీణా బ్యాంక్                     -  74

ఆఫీసర్ స్కేల్ II ( లా ) :

ఆంధ్రప్రదేశ్ ( ఏపీ ) :

ఆంధ్రప్రదేశ్ గ్రామీణా వికాస్ బ్యాంక్      -   2

ఆఫీసర్ స్కేల్ II ( సీఏ)  :

ఆంధ్రప్రదేశ్ గ్రామీణా వికాస్ బ్యాంక్    -     1

ఆఫీసర్ స్కేల్ II ( ఐటీ ) :

ఆంధ్రప్రదేశ్ గ్రామీణా వికాస్ బ్యాంక్     -    2

తెలంగాణ గ్రామీణా బ్యాంక్                    -    2

ఆఫీసర్ స్కేల్ II ( జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ ) :

ఆంధ్రప్రదేశ్ (ఏపీ ) :

ఆంధ్రప్రదేశ్ గ్రామీణా వికాస్ బ్యాంక్    -   25

ఆంధ్ర ప్రగతి గ్రామీణా బ్యాంక్              -   68

తెలంగాణ  :

తెలంగాణ గ్రామీణా బ్యాంక్                -  20

ఆఫీసర్ స్కేల్ III  :

ఆంధ్రప్రదేశ్ (ఏపీ ) :

ఆంధ్రప్రదేశ్ గ్రామీణా వికాస్ బ్యాంక్    -     4

మొత్తం పోస్టులు  :

భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఐబీపీఎస్ బ్యాంక్ లలో కలిపి మొత్తం 8106 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హతలు  :

ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్), ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు బాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు మరియు లోకల్ బాష వచ్చిన వారు ( తెలుగు) , కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న లేక పోయిన ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును.

మిగిలిన పోస్ట్ లకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి అగ్రికల్చర్ /హార్టీకల్చర్/ఫారెస్ట్రీ/అనిమల్ హస్బెండరీ/వెటర్నరీ సైన్స్ /అగ్రికల్చర్ ఇంజనీరింగ్ /పిసికల్చర్/అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కార్పొరేషన్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/మేనేజ్మెంట్ /లా/ఎకనామిక్స్ లేదా అకౌంటన్సీ విభాగాలలో బాచిలర్ డిగ్రీ కోర్సులను/సీఏ/లా కోర్సులు/ఎంబీఏ (ఫైనాన్స్), (మార్కెటింగ్) విభాగాలలో బాచిలర్ డిగ్రీ కోర్సులను పూర్తి చేసి, కంప్యూటర్ విభాగాలలో నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

వయసు  :

18 నుండి 40 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు  :

ఓసీ/జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 850 రూపాయలు వరకూ దరఖాస్తు ఫీజులను చెల్లించవలెను.

ఎస్సీ/ఎస్టీ/దివ్యంగులు/ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ అభ్యర్థులకు 175 రూపాయలు దరఖాస్తు ఫీజులను చెల్లించవలెను.

ఎలా ఎంపిక చేస్తారు:

ఆన్లైన్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్, ఇంటర్వ్యూ  తదితర అంశాలను పరిగణనలోనికి తీసుకొని ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

పరీక్ష సిలబస్ - వివరాలు  :

రీసనింగ్, న్యూమారికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్,కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ నాలెడ్జి, హిందీ నాలెడ్జి తదితర అంశాలను ఈ పరీక్ష - సిలబస్ లో పొందుపరిచారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ఆకర్షనీయమైన వేతనం లభించనుంది.

సుమారుగా నెలకు 20,000 రూపాయలుకు పైన జీతం అందనుంది.

Website

Notification

Apply Links



Post a Comment

0 Comments