Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Postal Group C Jobs : పోస్టల్ శాఖ నుంచి తాజాగా గ్రూప్ సి ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ను విడుదల 63,200 వరకు జీతం

పోస్టల్ శాఖ లో నుంచి తాజాగా స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది.స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకు భారీ స్థాయిలో వేతనాలు లభించనున్నాయి.కేవలం ఒక వ్రాత పరీక్షతో స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.ఈ ఉద్యోగాలకు సంభందించి మరిన్ని వివరాలు సవిరంగా తెలుసుకుందాము.

ముఖ్యమైన అంశాలు:

1).ఇవి స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు.

2).భారీ స్థాయిలో వేతనాలు.

3).కేవలం వ్రాత పరీక్ష ఎంపిక.

4).ఇరు రాష్ట్రాల అభ్యర్థులు అందరూ అర్హులే.

Postal Group C Jobs

ఈ పోస్టులకు అర్హత కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలకు చెందిన మేల్ అండ్ ఫిమేల్ అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు.

అదే విధంగా అర్హత కలిగిన ఇండియన్ సిటిజన్స్ మేల్ & ఫిమేల్ అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 11 జులై 2022 వ తారికు నాటికీ అప్లికేషన్ ను ఆఫ్ లైన్ విధానంలో పోస్టు ద్వార పంపవలసి ఉంటుంది.

మొత్తం పోస్టులు:

ఈ స్టాఫ్ కార్ డ్రైవర్ మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

పోస్టు యొక్క పేరు:

స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు.

విభాగాల వారీగా ఖాళీలు:

బిలాస్పూర్ డివిజన్  -02

(యు.ఆర్-01, ఎస్సి-0, ఎస్టీ -01, ఒబిసి- 0, ఇ.డబ్ల్యూ.ఎస్ - 0)

దుర్గ్  డివిజన్           -02

(యు.ఆర్-01, ఎస్సి-0, ఎస్టీ -01, ఒబిసి- 0, ఇ.డబ్ల్యూ.ఎస్ - 0)

రైగర్హ్ డివిజన్           -01

(యు.ఆర్-0, ఎస్సి-0, ఎస్టీ -0, ఒబిసి- 0, ఇ.డబ్ల్యూ.ఎస్ - 01)

రాయ్ పూర్             -04

(యు.ఆర్-02, ఎస్సి-01, ఎస్టీ -01, ఒబిసి- 0, ఇ.డబ్ల్యూ.ఎస్ - 0)

సర్కిల్ ఆఫీసు         -01

(యు.ఆర్-01, ఎస్సి-0, ఎస్టీ -0, ఒబిసి- 0, ఇ.డబ్ల్యూ.ఎస్ - 0)

మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది.

అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా ఏదైనా గుర్తింపు పొందిన బోర్డుల నుంచి పదో తరగతి అర్హత కలిగి ఉండాలి.

మరియు లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలి.

మరియు మోటార్ మెకానిజమ్ మీద అవగాహన ఉండాలి. చిన్న చిన్న మైనెర్ డిఫెక్ట్స్ చూడగలగాలి.

వయస్సు:

ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు వయస్సు అనేది 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు ఉండాలి.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఓబీసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్టీ/ఎస్సి అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఎక్స్ - సర్వీస్ మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి కలదు.

జీతం వివరాలు:

ఈ స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులకు 19,900/- రూపాయల నుంచి 63,200/-రూపాయలు వరకూ ఆకర్షనీయమైన వేతనం లభించనుంది.

ఎంపిక విధానం:

ఈ స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులను వ్రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

అప్లై చేసుకునే విధానం:

ఈ స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు అనేది ఆఫ్ లైన్ విధానంలో స్పీడ్ పోస్ట్ ద్వారా చేసుకొవాల్సి ఉంటుంది.

అప్లికేషన్ ను పంపవలసిన చిరునామ:

అసిస్టెంట్ డైరెక్టర్ (స్టాఫ్),
ఒ/ఒ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ,
చత్తిస్ ఘర్,రాయ్ పూర్ -492001.

ఫీజు వివరాలు:

ఓబీసి మరియు జనరల్ కేటగిరి అభ్యర్థులకు 100/-ఫీజు అనేది చెల్లించవలసిఉంటుంది.

ఎస్టీ/ఎస్సి మరియు ఫిమేల్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు అనేది చెల్లించవలసిన అవసరం లేదు.

పరిక్ష విధానం:

ఈ పోస్టులకు సంభందించి మొత్తమ్ మూడు స్టేజీలలో
పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

స్టేజీ -1

మోటార్ మెకానిజమ్ మరియు ట్రాఫిక్ రూల్స్ & సిగ్నల్స్ మరియు రెగ్యులేషన్ మీద పరిక్ష అనేది ఉంటుంది.

స్టేజీ -2

మోటార్ మెకానిజమ్ మరియు రెవెర్సింగ్ వెహికల్స్ మీద ప్రాక్టికల్ గా టెస్ట్ ఉంటుంది.

స్టేజ్ -3

ఫార్వార్డ్ డ్రైవింగ్ మీద టెస్ట్ అనేది ఉంటుంది.

అప్లికేషన్ లింక్:

ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు అందరూ కూడా www.cgpost.gov.in లో డౌన్లొడ్ చెసుకొవాల్సి ఉంటుంది.


Post a Comment

0 Comments