AP TET విజయం సాధించడానికి TOP 30 బిట్స్ క్రింద ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు మొదట ప్రశ్నను చదవండి దాని తరువాత జవాబును గుర్తించండి. మీరు సరిగ్గా గుర్తించారో లేదో చూసుకొవడానికి "కీ" ని క్రింద ఇవ్వడం జరిగింది. 30 బిట్స్ ని ఇప్పుడు వరుసగా చూదం.
1). సరైన సర్దుబాటు అనేది ?
1) స్వీయ నిర్దేశితం
2) యధార్ధ నిర్దేశితం
3) పరిస్థితి నిర్దేశితం
4) జన నిర్దేశితం
1. ఎ & సి 2. బి & సి 3. ఎ & డి 4. ఎ & బి
Ans: 2. బి & సి
2). వాస్తవ ఆత్మ భావనకు, ఆదర్శ ఆత్మ భావనకు మధ్య అంతరాన్ని కొలిచేది
1) వైఖరి మాపనులు
2) సెమాన్టిక్ డిఫరెన్షియల్ స్కేల్
3) మూర్తిమత్వ షొదికలు
4) టి.ఏ.టి
Ans : 2) సెమాన్టిక్ డిఫరెన్షియల్ స్కేల్
3). బోధనలోని అంశాల వరుసను గుర్తించుము.
1) ప్రక్రియ - ఫలితం - ప్రవేశం
2) ప్రవేశం - ఫలితం - ప్రక్రియ
3) ఫలితం - ప్రవేశం - ప్రక్రియ
4) ప్రవేశం - ప్రక్రియ - ఫలితం
Ans : 4) ప్రవేశం - ప్రక్రియ - ఫలితం
4). క్రింది వాటిలో ఏ నికష ద్వారా మూర్తిమత్వము యొక్క అచేతనాంశాలను అధ్యాయనము చేయలేము?
1) వాక్యపురాన నికష
2) కథాపురాన నికష
3) సాంఘిక నాటకం
4) సాంఘికమితి
Ans : 4) సాంఘికమితి
5). డిస్ క్వాలికులియా అనగా?
1) చదవటం, రాయడం లో ఆశక్తులు
2) చిన్న చిన్న గణిత సమస్యలు సరిగా చేయలేకపోవడం
3) సరిగ్గా ఉచ్చరించలేకపోవడం
4) తరగతి గదిలో ఏకాగ్రత చూపలేకపోవడం
Ans : 2) చిన్న చిన్న గణిత సమస్యలు సరిగా చేయలేకపోవడం
6). బాలనేర ప్రవృత్తి దీనికి సంబంధించినది ?
1) నైతిక సమస్య
2) న్యాయపరమైన సమస్య
3) ప్రవర్తన సమస్య
4) సామాజిక సమస్య
Ans : 3) ప్రవర్తన సమస్య
7). ఒక ఉపాధ్యాయుడు విద్యార్ధుల అభివృద్ధి లో వారీ నడవడిక, అభిరుచి, మూర్తిమత్వము, శారీరక వికాసము, అభ్యసనము, తదితర అంశాలను మూల్యాంకనము చేస్తే అది ఎటువంటి మూల్యాంకనము ?
1) నిరంతర మూల్యాంకనము
2) సమగ్ర మూల్యాంకనము
3) ప్రాగుక్తిక మూల్యాంకనము
4) సంగత మూల్యాంకనము
Ans : 2) సమగ్ర మూల్యాంకనము
8). Retrieval అనగా ?
1) ధారణ
2) జ్ఞప్తికి తెచ్చుకోవడం
3) పునరభ్యసనము
4) పునఃస్మరణ
Ans : 2) జ్ఞప్తికి తెచ్చుకోవడం
9). పియాజే ప్రకారం కొత్త అనుభవాల ద్వార స్కిమాటాలకు జ్ఞానాన్ని సమకూర్చడము ?
1) సాంశీకరణం
2) అనుగున్యము
3) సమతుల్యము
4) స్ముతి పథం
Ans : 1) సాంశీకరణం
10). విద్యార్థి కి ముందుగా వృత్తాన్ని గీయడము నేర్పించి , తరువాత చతురస్రము , త్రిభుజము గీయడము నేర్పించడము ఏ వికాస నియమo?
1) వికాసము సంచిత ప్రక్రియ
2) సులభం నుండి కఠినానికి దారితీస్తుంది
3) వికాసము క్రమానుగతమైనది
4) వికాసములో వైయుక్తిక భేదాలు ఉంటాయి.
Ans : 3) వికాసము క్రమానుగతమైనది
11). వైగాట్ స్కీ దృష్టిలో స్కఫొల్డింగ్ అను బావనకు చెందిన ఉదాహరణ ?
1) ఉపాధ్యాయుడు విద్యార్ధులకు కావలసిన అదనపు సమాచారం అందించుట
2) పిల్లలను తండ్రి సవారీకి తీసుకెల్లుట
3) బిడ్డ మోటార్ బైక్ నడుపుటకు తల్లి సహాయపడుట
4) పిల్లలు సమూహంగా పరిక్షలు రాయుట AP TET DSC Top 30 Model Bits Paper 1A
Ans : 3) బిడ్డ మోటార్ బైక్ నడుపుటకు తల్లి సహాయపడుట
12). విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం 1 - 5 తరగతులకు పనిదినాల సంఖ్య ఎంత ?
1) 180
2) 200
3) 220
4) 230
Ans : 2) 200
13). సరియైన శిక్షణనిస్తే భవిష్యత్తులో ఉపాధ్యాయుడుగా రాణిo చడానికి కావలసిన ప్రస్తుత లక్షణాలు గుర్తించడానికి ఉపయోగించవలసిన సాధనము ?
1) వైఖరి మాపని
2) సాధన పరిక్ష
3) అభిరుచి సోదిక
4) సహజ సామర్ధ్య పరిక్ష
Ans : 4) సహజ సామర్ధ్య పరిక్ష
14). జాతీయ పాఠ్య ప్రణాళికా చట్రము 2005 ప్రకారం ఉపాధ్యాయుడు ప్రధానంగా ఒక ?
1) విలువల సృష్టి కర్త
2) క్రమశిక్షణను అమలు పరిచేవాడు
3) జ్ఞానం ప్రసారం చేసెవాడు
4) అభ్యసనానికి వీలు కల్పించేవాడు
Ans : 4) అభ్యసనానికి వీలు కల్పించేవాడు
15). వైకల్యము కల పిల్లలకు సమ్మిలిత విద్యాచట్టాన్ని భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో చేసింది?
1) 1972
2) 1974
3) 1975
4) 1973
Ans : 2) 1974
16). ఒక బాలునికి గణిత ఉపాధ్యాయుడు అంటే భయం లేదు కానీ గణితమంటే భయం. ఇది ఎందువల్ల ?
1) బహుళ విచక్షణ
2) ఉద్దీపన విచక్షణ
3) ప్రతిస్పందన విచక్షణ
4) సాధారనీకరణ
Ans : 3) ప్రతిస్పందన విచక్షణ
17). విస్తృతమైన అంశాన్ని నేర్చుకోవడానికి సరైన పధ్ధతి ?
1) సంపూర్ణ పద్ధతి
2) విభాగ పద్ధతి
3) విరామ పధ్ధతి
4) వల్లే వేయటం
1. ఎ & సి 2. బి & సి 3. ఎ & డి 4. బి & డి
Ans : బి & సి
18). ఒక అంశాన్ని ఎలా చేయాలి అనే దానిపై ఆధారపడే అభ్యసనమును క్రింది వాటిలో గుర్తించుము.
1) భావన అభ్యసనము
2) క్రమయుక అభ్యసనము
3) వాస్తవిక అభ్యసనము
4) నైపుణ్య అభ్యసనము
Ans : 2) క్రమయుక అభ్యసనము
19). కిరణ్ మంచి ' బేస్ బాల్ ' క్రీడాకారుడు, అతను ఇప్పుడు క్రికెట్ ఆడటం నేర్చుకోవాలనుకుo టున్నాడు
1) అనుకూల బదలాయింపు
2) ప్రతికూల బదలాయింపు
3) సూన్య బదలాయింపు
4) ద్విపార్ష్వ బదలాయింపు
Ans : 1) అనుకూల బదలాయింపు
20). వర్ణించిన ప్రవర్తనకు సంబంధించి సరిగ్గా జతపరచబడిన రక్షక తంత్రాన్ని గుర్తించుము.
1) వ్యక్తి తన అచేతన కోరికకు వ్యతిరేకంగా ఆలోచించడం మరియు చేయడం - హేతుకీకరణం
2) వ్యక్తి తన అసంబద్ధ ప్రవర్తనను సమర్ధించుకోవడము - ప్రతిచర్యా నిర్మితి
3) తన జీవితంలోని ప్రారంభ దశలోని ప్రవర్తనకు తిరోగమించడము - ప్రతిగమనము
4) తనలోపాన్ని పూడచటానీకీ విపరీతమైన వక్తిని వినియోగించడము - దమనము
Ans : 3) తన జీవితంలోని ప్రారంభ దశలోని ప్రవర్తనకు తిరోగమించడము - ప్రతిగమనము
21). మార్గదర్షకత్వ నిర్దేశీత విద్యా ప్రణాళిక కింది వాటిలో దేన్ని అందించాడానికి ఉద్దేశీంచింది ?
1) సలహాదారుల కొరతను తీర్చడానికి
2) ఉపాధ్యాయుల భారాన్ని తగ్గించడానికి
3) విద్యార్ధుల స్వీయ వికాసాన్ని ప్రోత్సహించడానికి
4) విద్యార్ధుల్లో పెరుగుతున్న సమస్యలను తీర్చడానికి
Ans : 3) విద్యార్ధుల స్వీయ వికాసాన్ని ప్రోత్సహించడానికి
22). రాము అనే పిల్లవాడు మానసిక వికాసము సరిగ్గా లేనందున సాంఘిక , నైతిక వికాసాల్లో వెనుకబడి ఉండటం ను సూచించే వికాస నియమo?
1) ఖచ్చితమైన నమూనాను పాటించును
2) వ్వక్తి గత భేధాలు ఉండును
3) ఖచ్చితమైన దిశ లో కొనసాగును
4) పరస్పర సంబందంగా కొనసాగును
Ans : 4) పరస్పర సంబందంగా కొనసాగును
23). పిల్లవాడు ఒక సమస్యకు అనేక రకమైన పరిష్కారాలను చూపించాడు. ఆ రకమైన ఆలోచనలు
1) సామైక్య ఆలోచనలు
2) విభిన్న ఆలోచనలు
3) సృజనాత్మక ఆలోచనలు
4) 2 మరియు 3
Ans : 4) 2 మరియు 3
24). పాఠశాల పరిక్ష నిర్వహణలో పరిక్షల క్రమ సంఖ్యల ఆధారంగా 20-30 గల వారు 3వ గదిలో పరీక్ష వ్రాయవలసినదిగా ఉపాధ్యాయుడు నిర్దేశీస్తే 24,25,26 మొదలగు క్రమ సంఖ్య గలవారు కూడా 3వ గదిలోకి ప్రవేశీస్తే అపుడు పియాజె ప్రకారం ఆ పిల్లలు ఏ ప్రచాలక దశకు చెందును ?
1) ఇంద్రియాచాలక దశ
2) పూర్వ ప్రచాలక దశ
3) మూర్త ప్రచాలక దశ
4) అమూర్త ప్రచాలక దశ
Ans : 3) మూర్త ప్రచాలక దశ
25). ఒక వ్యక్తి తన ప్రయాణంలో ద్విచక్ర వాహనంపై వెళ్ళినప్పుడు సంబంధించిన పత్రాలను , హెల్మెట్ మొదలగు జాగ్రత్తలు తీసుకోని బయలుదేరితే అతడు ఏ స్థాయికి చెందును?
1) పూర్వ సంప్రదాయక
2) సాంప్రదాయక
3) ఉత్తర సంప్రదాయక
4) ఏదీకాదు
Ans : 2) సాంప్రదాయక
26). క్రింది వానిలో వ్యక్తంతర్గత వైయుక్తిక భేధము కానిది?
1) ఒకే వ్యక్యి ప్రవర్తనలో వివిధ సన్నివేసాలలో వ్యత్యాసము
2) ఏ వ్యక్తి జీవితంలో అన్ని సన్నివేసాలలో ఒకేలా ప్రవర్తించడము
3) వివిధ పాఠ్య విషయాల పట్ల విద్యార్థికి వుండే సామర్ధ్యాల పట్ల వ్యత్యాసము
4) వివిధ వ్యక్తుల మధ్య వివిధ సామర్ధ్యాల మధ్య వ్యత్యాసము
Ans : 4) వివిధ వ్యక్తుల మధ్య వివిధ సామర్ధ్యాల మధ్య వ్యత్యాసము
27). EDSAC...... అనగా?
1) మొదటి తరం కంప్యూటర్
2) రెండవ తరం కంప్యూటర్
3) మూడవ తరం కంప్యూటర్
4) నాల్గవ. తరం కంప్యూటర్
Ans : 1) మొదటి తరం కంప్యూటర
28). నూతన విద్యా విధానం - 2020 ప్రకారం foundation stage యొక్క కాల వ్యవధి ఎంత?
1) 5 సంవత్సరాలు
2) 3 సంవత్సరాలు
3) 4 సంవత్సరాలు
4) 6 సంవత్సరాలు
Ans : 1) 5 సంవత్సరాలు
29). ''మనబడి : నాడు - నేడు'' ను ఎక్కడ ప్రారంభించారు ?
1) కడప
2) అమరావతి
3) విజయనగరం
4) ఒంగోలు
Ans : 4) ఒంగోలు
30). క్రింది వాటిలో ఏ ప్రవర్తన దానికి సంభందించిన సామర్ధ్యముతో సరిగ్గా జతపరచబడి ఉంది?
1) తార్కిక క్రమాన్ని గుర్తించే వ్యక్తి కలిగి ఉండేది ప్రత్యక్ష సామర్ధ్యము.
2) ఒక వస్తువు ఏ విధంగా కనబడుతుందో ఊహించగలిగే వ్యక్తి కలిగి ఉండేది ప్రదేశ సంబంధ సామర్ధ్యము
3) వేగంగా గణనలు చేయగలిగే వ్యక్తి కలిగి ఉండేది షబ్దిక సామర్ధ్యము
4) ఒకసారి విని బాగా అవగాహన చేసుకోగలిగిన వ్యక్తి కలిగి ఉండేది వివేచన సామర్ధ్యము
Ans : 2) ఒక వస్తువు ఏ విధంగా కనబడుతుందో ఊహించగలిగే వ్యక్తి కలిగి ఉండేది ప్రదేశ సంబంధ సామర్ధ్యము
0 Comments